Nagababu Warns Balakrishna బాలకృష్ణకు మెగా బ్రదర్ నాగబాబు వార్నింగ్

Nagababu s controversial comment on balakrishna

Tollywood, Nagababu, Nagendra Babu, Nandamuri Balakrishna, Nagababu shock comments on Balakrishna, Nagababu tirade against Nandamuri Balakrishna, Chiranjeevi Nagababu, Megastar Chiranjeevi brother Nagababu, tollywood, movies, entertainment

Megastar Chiranjeevi's brother Nagababu aka Nagendra Babu, who shocked many in the industry on Sunday, continued his tirade against Nandamuri Balakrishna

బాలకృష్ణకు మెగా బ్రదర్ నాగబాబు వార్నింగ్

Posted: 01/11/2019 09:47 PM IST
Nagababu s controversial comment on balakrishna

మెగాబ్రదర్ నాగబాబు ఇంతకాలం తర్వాత బాలకృష్ణ విమర్శలపై స్పందించారేంటి? దీని వెనుక రాజకీయ కారణం ఉందా? అని కొందరు మీడియా మిత్రులు తనను అడిగారని మెగాబద్రర్ నాగబాబు తెలిపారు. ఈ వీడియోల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మిగతా నేతలు, వ్యక్తులకు రాజకీయ ఉద్దేశాలు ఉండొచ్చనీ, తమకు మాత్రం లేవన్నారు. తమకు సంస్కారం, కల్చర్ వున్నాయి కాబట్టి ప్రతీ అడ్డమైన దానికి రియాక్ట్ కాలేదని వ్యాఖ్యానించారు.

నందమూరి బాలకృష్ణ కామెంట్లకు కౌంటర్ గా నాగబాబు ఆరో వీడియోను విడుదల చేశారు. నందమూరి బాలకృష్ణ ఓసారి మీడియాతో మాట్లాడుతూ.. ‘చిరంజీవి ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరిపోడు’ అని వ్యాఖ్యానించారని మెగాబ్రదర్ నాగబాబు అన్నారు. ఈ క్లిప్పింగ్ ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా వచ్చిందన్నారు. ఈ మాటలతో తమకు చాలా బాధ కలిగిందన్నారు. దీంతో చిరంజీవి స్పందిస్తూ..‘బాలయ్య చిన్నపిల్లాడు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు’ అని వదిలేశారని గుర్తుచేశారు.

రిక్షా తొక్కే వ్యక్తి ఆయన కొడుక్కి గొప్ప కావొచ్చనీ, బాలయ్య తన తండ్రి గొప్పతనాన్ని కీర్తించుకోవడం ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు. అయితే పక్కనవారిని అవమానించడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు ఆరో వీడియోను విడుదల చేశారు. అందులో బాలకృష్ణను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘చిరంజీవి కాలిగోటికి కూడా బాలకృష్ణ సరిపోడు’ అని చెబితే మీకు ఎలా ఉంటుంది? మీ ఫ్యాన్స్, మీ ఇంట్లో, పార్టీ వాళ్లకు ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు.

ఎంత అహంకారం మీకు? మాకు కోపాలు రావా? సర్.. మర్యాదగా చెబుతున్నా మీకు.. దయచేసి మాట్లాడేటప్పుడు నోరును అదుపులో పెట్టుకోండి. మీరు వంద విమర్శలు చేయండి. కానీ లూజ్ టంగ్ తో మాట్లాడకండి. కేవలం సంస్కారంతోనే మేం ఆగుతున్నాం. ఇక్కడ ఎవరూ ఎవరికీ భయపడరు. మా అన్నయ్య, తమ్ముడిని ఎవరైనా అంటే మాత్రం 100 శాతం రియాక్ట్ అవుతాం. ఇప్పటికైనా ఈ లూజ్ టంగ్ ను ఆపేస్తారని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.

విమర్శలు భరించి, భరించి, భరించి ఒళ్లు మండిపోయి ఇప్పుడు స్పందిస్తున్నామని నాగబాబు తెలిపారు. అయినా రియాక్ట్ కావడానికి అసలు టైమింగ్ ఏముందని ప్రశ్నించారు.‘‘మన ఇంట్లో దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తి ఒక సంవత్సరం తర్వాత కనబడ్డాడు. పోనీలే ఏడాది అయిపోయింది కదా. వదిలేద్దాం’ అని అనుకుంటామా? మనను కొట్టి పారిపోయినవాడు సంవత్సరం తర్వాత కనిపిస్తే వదిలేస్తామా? పట్టుకుని కొడతాం’’ అని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga babu  chiranjeevi  balakrishna  warning  tollywood  movies  entertainment  

Other Articles