Ram Rahim convicted in journalist's murder case జర్నలిస్టు హత్యకేసులో డేరా బాబా సహా ముగ్గురూ దోషులే..

Dera sacha sauda s gurmeet ram rahim singh convicted for murdering journalist

Dera Sacha Sauda, Gurmeet Ram Rahim, Gurmeet Ram Rahim news, Gurmeet Ram Rahim Singh, Haryana, haryana news, journalist murder, latest news about Ram Rahim case, Ram Rahim, Ram Rahim age, Ram Rahim case, Ram Rahim latest news, ram rahim news, journalist, Ram Chander Chhatrapati, murder case, Kuldeep Singh, Nirmal Singh

Self-styled godman and Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh and three others have been convicted for murdering journalist Ram Chander Chhatrapati in 2002.

జర్నలిస్టు హత్యకేసులో డేరా బాబా దోషే.. నిర్ధారించిన కోర్టు.. 17 శిక్ష ఖారారు..

Posted: 01/11/2019 05:15 PM IST
Dera sacha sauda s gurmeet ram rahim singh convicted for murdering journalist

పాత్రికేయుడి హత్య కేసులో తనను తాను దైవాంష సంభూతిడిగా చెప్పుకున్న డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం దోషిగా నిర్ధారిస్తూ తీర్పును వెలువరించింది న్యాయస్థానం. ఈ కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ తో పాటుగా మరో ముగ్గురినీ న్యాయస్థానం దోషులుగా తేల్చింది పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఈ నెల 17న ముగ్గురికి శిక్షను ఖరారు చేయనుంది. శుక్రవారం ఈ కేసు విచారణ జరిపిన పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులైన క్రిషన్ లాల్, కుల్దీప్ సింగ్, నిర్మల్ సింగ్ కోర్టుకు హాజరు కాగా.. డేరా బాబాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

డేరాబాబా దోషిగా తేలడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. పంచకుల ప్రత్యేక కోర్టు ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా హర్యానా, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిర్సాలోని డేరా సచ్చా సౌద హెడ్ క్వార్టర్స్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి బయటపెట్టారు. 'పూరా' సచ్ పత్రికలో డేరాబాబ అరాచాకాలపై ఎన్నో కథనాలు వచ్చాయి. 2002 అక్టోబరులో జర్నలిస్ట్ రామచంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన ఇంటి ముందే నిందితులు తుపాకీతో కాల్చగా.. మూడు వారాల తర్వాత ఆయన కన్నుమూశారు.

జర్నలిస్టును డేరాబాబా అనుచరులు దారుణంగా హత్యచేశారనే ఆరోపణలతో కేసు నమోదయ్యింది. ఈ కేసును విచారణ జరిపిన కోర్టు బాబాతో పాటూ మరో ముగ్గుర్ని దోషులుగా తేల్చింది. అత్యాచారం కేసులో డేరాబాబాకు ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్షపడింది. హర్యానాలోని సునారియా జైల్లో శిక్ష కూడా అనుభవిస్తున్నారు. అత్యాచారం కేసులో రామ్ రహీమ్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు రావడంతో పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లో అల్లర్లు రేగాయి. డేరా బాబా అనుచరులు, అభిమానులు రెచ్చిపోయారు. ఈ ఘర్షణల్లో 40 మందికిపైగా చనిపోయారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles