New Twist In YS Jagan's CBI Cases జగన్ అక్రమాస్తుల కేసు.. మళ్లీ ఫస్ట్ నుంచి..

Ys jagan disappropriate cases investigations comes to begining

Hyderabad high court bifurcation, AP High Court, Andhra Pradesh High Court, Amaravati, Telangana High Court, Vijayawada, cbi court judge, CBI court judge AP High court, YS Jagan, YS Jagan cbi case, Telangana, Andhra Pradesh, amravati

CBI judge Venkata Ramana who is investigating the case has been transferred to Andhra Pradesh in lieu of High court bifurfication, the investigation is expected to start once again. A total of 11 charge sheets have been filed and three of them are in final stages.

హైకోర్టు విభజన ఎఫెక్ట్: జగన్ అక్రమాస్తుల కేసు.. మళ్లీ ఫస్ట్ నుంచి..

Posted: 01/04/2019 01:06 PM IST
Ys jagan disappropriate cases investigations comes to begining

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎప్పుడో జరగాల్సిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ఆలస్యమై సుమారుగా ఐదేళ్ల తరువాత రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పడి.. పనిచేయడం కూడా ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నెత్తిన పాలుపోసినట్లు అయ్యింది. ఎందుకంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌ దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లపై సీబీఐ కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది.

రెండున్నరేళ్లుగా జగన్ కేసులపై కొనసాగుతున్న విచారణ న్యాయమూర్తి బదిలీతో వాదనలు మళ్లీ మొదట్నించి ప్రారంభం కానున్నాయి. దీంతో జగన్ కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. సీబీఐ ఈడీ కోర్టులో జగన్‌ ఆస్తుల కేసు శుక్రవారం విచారణకు రాగా.. తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది. జగన్‌ ఆస్తుల కేసులో మొత్తం 11 అభియోగపత్రాలను సీబీఐ నమోదు చేసింది.

విచారణ ప్రక్రియలో భాగంగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిగతా నిందితులు డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. నేరానికి ఎలాంటి సంబంధం లేకుండానే తమపై అక్రమంగా కేసులు బనాయించారు కాబట్టి ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని పిటిషన్లు వేశారు. వీటిపై గత కొంతకాలంగా వాదనలు కొనసాగుతున్నాయి. మొత్తం 11 కేసులకు గానూ 4 కేసుల్లో వాదనలు పూర్తయ్యాయి. రెండున్నరేళ్లుగా ఇది కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకట రమణను ఏపీకి కేటాయించడంతో బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చే న్యాయమూర్తి డిశ్చార్జ్‌ పిటిషన్లపై మళ్లీ వాదనలు వినాల్సి ఉంటుంది. ఒక్కో ఛార్జిషీట్లో తీర్పు వెల్లడించినట్లయితే ఇతర కేసులపై ప్రభావం పడుతుందని భావించి.. అన్ని కేసుల్లో ఒకేసారి తీర్పు ఇవ్వాలని గతంలో సీబీఐ కోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిశ్చార్జ్‌ పిటిషన్లపై మళ్లీ వాదనలు జరగనున్నాయి. అందుకు మరికొన్నేళ్లు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBI court judge AP High court  YS Jagan  YS Jagan cbi case  Telangana  Andhra Pradesh  

Other Articles