High court reserves verdict on Hero prabas petition ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ పై తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు

High court reserves verdict on hero prabas petition

Hero Prabhas, prabhas rayadurgam guest house, telangana government, High court, Telangana

High court delivers interesting comments during Hero Prabhas Guest House sieze hearing, objects government lawyers allegedly saying prabhas as encrocher.

ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ పై తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు

Posted: 01/03/2019 04:13 PM IST
High court reserves verdict on hero prabas petition

టాలీవుడ్ హీరో ప్రభాస్ గెస్ట్ హౌజ్ సీజ్ పిటీషన్ పై హైకర్టు అసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీల్ లైఫ్ లో విలన్లను ఎదుర్కోన్న బాహుబలికి రియల్ లైఫ్ ప్రతినాయకులతో తలపడి వుండరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సామాన్యుడి విషయంలో అయితే అప్పుడే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవాళ్లమన్న హైకోర్టు.. ప్రభాస్ ఒక సెలబ్రిటీ కాబట్టి అతడికి సంబంధించిన కేసు విషయంలో తీర్పు.. అనేక మంది ఆసక్తి చూపుతారని పేర్కోంది.

ప్రభాస్ గెస్ట్ హౌజ్ సీజ్ విషయంలో అందుకనే అచితూచి వ్యవహరిస్తున్నామని హైకోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో ప్రభాస్ భూకబ్జాదారుడన్న ప్రభుత్వ లాయర్ వ్యాఖ్యలపై కూడా హైకోర్టు అభ్యంతరం చెప్పింది. దీంతో ప్రభుత్వ లాయర్ వాదనలు వినిపిస్తూ హీరో ప్రభాస్ కు అనుకూలంగా తీర్పును న్యాయస్థానం వెలువరించిన పక్షంలో ఆ భూమిని కబ్జా చేసిన వాళ్లూ అర్హులవుతారని వాదించారు.

కాగా ప్రభాస్ తాను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే రాయదుర్గంలోని భూమిని కొనుగోలు చేశారని, అందులోనే ఆయన తన గెస్ట్ హౌజ్ ను కట్టుకున్నారని ప్రభాస్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తన వాదనను వినిపించారు. ఈ నేపథ్యంలో ఇరు తరపు న్యాయవాదుల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles