High court gives nod to telangana panchayat polls నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను అపలేం: హైకోర్టు

High court gives nod to telangana panchayat polls

Telangana Panchayat Elections 2019, Telangana High Court, BC reservation, R Krishnaiah, Panchayat election notification, politics

High court gives nod to telangana panchayat polls, says it cannot stop elections after the notification is issued. Expressing dissatisfaction over the decrease of Backward castes reservation from 34 to 22 percent by Telangana government, R.Krishnaiah approached High court.

నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను అపలేం: హైకోర్టు

Posted: 01/03/2019 02:47 PM IST
High court gives nod to telangana panchayat polls

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యాక ఏ కోశాన వాటిని ఆపలేమని రాష్ట్రోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ నిలిపివేతకు నిరాకరించింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఇందుకోసం ప్రభుత్వానికి నాలుగు వారాల సమయాన్ని కేటాయించిన న్యాయస్థానం.. ఈ పిటీషన్ పై తదుపరి విచారణను కూడా నాలుగు వారాలకు వాయిదా వేసింది. వెనకబడిన తరుగతుల అభ్యర్థులకు పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది.

ఈ క్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ బీసీ నాయకుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించి బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడం అసంబద్ద నిర్ణయమని పేర్కోంటూ పిటీషన్ దాఖలు చేశారు. ఆర్ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22కి తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కృష్ణయ్య కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles