Thammanna's 'street dog' jibe at BJP leaders బీజేపి నేతలను వీధికుక్కలతో పోల్చిన జేడీఎస్ ఎమ్మెల్యే

Thammanna s street dog jibe at bjp leaders

D C Thammanna, JD Secular, BJP, Street dogs, congress mlas, Umesh katti, yeddurappa, karnataka, politics

Taking a dig at BJP leaders, JDS leader D C Thammanna has drawn an analogy between them and the 'street dogs' while refuting BJP lawmaker Umesh Katti's claim that the dispensation would collapse soon.

బీజేపి నేతలను వీధికుక్కలతో పోల్చిన జేడీఎస్ ఎమ్మెల్యే

Posted: 12/29/2018 03:51 PM IST
Thammanna s street dog jibe at bjp leaders

కర్ణాటక జేడీఎస్ పార్టీ నేత డీసీ తమన్నా బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ నాయకుడు డీసీ తమన్నా బీజేపీ నేతలను వీధి కుక్కులతో పోల్చారు. జనవరి 1వ తేదీ తరువాత కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని.. తామే ప్రభుత్వాన్ని స్థాపిస్థామని బీజేపీ ఎమ్మెల్యే ఉమేష్ కత్తి చేసిన వ్యాఖ్యలపై మండిపడిన ఆయన ఈ నేపథ్యంలో వారిని కుక్కలతో పోల్చారు.

కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందా అని బీజేపి నేతలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించిన డీసీ తమన్నా... వారిని గోతికాడ కుక్కలతో పోల్చారు. కర్ణాటకలోని 15 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో వున్నారని, వారి మద్దతు తీసుకున్న తరువాత కర్ణాటకలో కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని.. వచ్చే వారం నాటికి కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ నేత ఉమేష్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీనిపై స్పందించిన డీసీ తమన్నా... గతంలో మాజీ ముఖ్యమంత్రి జేహెచ్ పటేల్ అసెంబ్లీలో చెప్పిన మాటలను గుర్తు చేశారు. ఏనుగులు వెళుతుంటే దాని మీద నుంచి ఏమైనా తిండి కిందపడుతుందా అని వీధి కుక్కలు ఎదురుచూస్తుంటాయని అన్నారు. అయితే అక్కడ తిండి కింద పడదని, కుక్కలకు ఆహారం దొరకదని అన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ నేతలకు అతికినట్టు సరిపోతాయని వ్యాఖ్యానించారు.

అంతేకాదు ఇలాంటి చౌకబారు విశ్వాసాలతోనే యడ్యూరప్పకు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారని, అప్పడు వారు చేసిన బేరసారాలను, మాట్లాడిన ఫోన్ రికార్డులను కూడా కర్ణాటక ప్రజలందరూ విని అసహించుకున్నారని అన్నారు. బీజేపికి ప్రజల్లో బలం లేదని తేలిపోయిన తరుణంలో ఇక దొంగ పద్దతిలో గద్దెనెక్కాలని ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని తమన్నా తీవ్రంగా దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : D C Thammanna  JD Secular  BJP  Street dogs  congress mlas  Umesh katti  yeddurappa  karnataka  politics  

Other Articles