Telangana Government gives shock to gitam university గీతం యూనివర్సిటీ బీ-టెక్ సర్టిఫికేట్లు చెల్లవు..

Telangana government gives shock to gitam university

gitam university B-Tech certificates not valid, Telangana Government, gitam university, B-tech certificates, AICTE, MBA student

Telangana Government gives shock to gitam university, says its B-tech certificates are not valid as they have not taken AICTE permission.

గీతం యూనివర్సిటీ బీ-టెక్ సర్టిఫికేట్లు చెల్లవు..

Posted: 12/29/2018 11:30 AM IST
Telangana government gives shock to gitam university

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ డీమ్డ్ వర్సిటీ ‘గీతం’కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో గీతం యూనివర్సిటీ ద్వారా బీ-టెక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు, చదివిన విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారనుంది. గీతం విశ్వవిద్యాలయం అందించే బీటెక్ డిగ్రీలు చెల్లవని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. నిర్ధిష్ట అనుమతులు లేకుండా బీటెక్ కోర్సులను నిర్వహిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

బీటెక్ కోర్సులను నిర్వహించేందుకు గాను అన్ని యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు తప్పనిసరిగా పోందాల్సిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతులను గీతం యూనివర్సిటీ పోందలేదని ప్రభుత్వం పేర్కోంది. ఏఐసీటీఈ అనుమతి లేకుండా సాంకేతిక కోర్సులను నిర్వహించే అర్హత గీతం యూనివర్సీటీకి లేదని తేల్చిచెప్పింది.

ఈ సందర్భంగా గీతం నుంచి బీటెక్ డిగ్రీ పొంది ఇటీవల ఎంబీఏలో చేరిన ఓ యువతి అడ్మిషన్ ను రద్దుచేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంట్(గీతం)కు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ప్రాంగణాలు ఉన్నాయి. దీన్ని గీతం విశ్వవిద్యాలయం అని కూడా పిలుస్తారు. 1980లో ఆంధ్రా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఈ విద్యా సంస్థ ఏర్పడింది. 2007లో యూజీసీ నిబంధనలు పాటించడంతో డీమ్డ్ హోదా పొందింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles