Lok Sabha passes triple talaq bill ట్రిఫుల్ తలాక్ బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్ సభ

Lok sabha passes triple talaq bill amid congress walkout

congress triple talaq, Triple talaq lok sabha, Triple Talaq Bill, lok sabha triple talaq, triple talaq, triple talaq congress, triple talaq aimim, triple talaq bjp, triple talaq shiv sena, triple talaq tmc, triple talaq jdu, triple talaq jds, politics

Lok Sabha passed the Triple Talaq bill after government refused to refer the bill to joint select committee of the Parliament. 245 Lok Sabha MPs voted in favour of the bill, while 11 members voted against it.

ట్రిఫుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం.. కాంగ్రెస్ వాకౌట్..

Posted: 12/27/2018 07:45 PM IST
Lok sabha passes triple talaq bill amid congress walkout

ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన ట్రిపుల్ తలాక్ సవరణ బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 245 మంది సభ్యులు ఓటేశారు. బిల్లు చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. ఈ బిల్లుకు సవరణలు చేయాలని, జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. బిల్లు కోసం ఓటింగ్ నిర్వహించడానికి కొద్ది సేపటి ముందు కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలకు చెందిన ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.

అంతకు ముందు ట్రిపుల్ తలాక్ బిల్లు విషయమై సభలో ఐదు గంటలపాటు వాడివేడి చర్చ జరిగింది. ముస్లిం మహిళల సమానత్వానికి ఈ బిల్లు ఉపకరిస్తుందని ఎన్డీయే సర్కారు పేర్కొనగా.. ముస్లిం పర్సనల్ లాకు ఈ బిల్లు తూట్లు పొడుస్తుందని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. 20 ముస్లిం దేశాలు ట్రిపుల్ తలాఖ్‌పై నిషేధం విధించగా లేనిది.. ఇండియాలో నిషేధిస్తే తప్పేంటని న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ ప్రతిపక్షాలను నిలదీశారు.

ట్రిపుల్ తలాక్ చట్టంగా మారితే.. భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మగాళ్లకు జైలు శిక్ష పడటం, ఆ మూడేళ్లలో భరణం విషయంలో స్పష్టత లేకపోవడం పట్ల విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఏ మతం విషయంలోనూ ఇంత కఠిన శిక్షలు లేవని ప్రతిపక్షాలు గుర్తు చేశాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ గతంలోనే ఆమోదం తెలిపింది. కానీ రాజ్యసభలో విపక్షాలు అడ్డుపడ్డాయి. దీంతో ఈ బిల్లును ఆర్డినెన్స్‌గా తీసుకొచ్చిన ప్రభుత్వం కొన్ని మార్పులతో మరోసారి లోక్‌సభ ఆమోదానికి పంపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : triple talaq  bjp  congress  aimim  lok sabha  tmc  parliament  national politics  

Other Articles