SR warns against lighting of camphors in trains శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వాములూ.. అలర్ట్.. అలర్ట్..

Southern railway warns against lighting of camphors in trains

sabarimala, Ayyappa swamy, Southern Railway, Ayyappa devotes, sabarimala pilgrims, train, puja, irumudi, 3 years sentence

Taking a serious view of some sabarimala pilgrims lighting camphore inside the train while perfomring a puja to irumudi, the southern railway alerted stating that if devotees caught there will be fine and 3 years sentence.

శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వాములూ.. అలర్ట్.. అలర్ట్..

Posted: 12/26/2018 11:10 AM IST
Southern railway warns against lighting of camphors in trains

శబరిమల కొండకు వెళ్లే అయ్యప్ప స్వాములకు రైల్వేశాఖ హైఅలర్ట్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామి మాలధారణ చేసి మండలదీక్ష పూర్తి చేసిన భక్తులు శబరిమల కోండకు ఇరుముడితో వెళ్లడం పరిపాటి. అయితే ఇలా వెళ్లేవారి సంఖ్యలో అత్యధికం శబరిమలకు రైలులోనే ప్రయాణం చేస్తుంటారు. సుమారుగా ఒకటిన్నర రోజుల ప్రయాణంలో ఇరుముడులన్నీ ఒక చోట పెట్టే భక్తులు ఉదయం సాయంకాల వేళ్లలో హరతులు కూడా ఇస్తుంటారు.

అయితే ఇకపై మాత్రం ఇలా హరతి ఇవ్వడం కుదరదని రైల్వేశాఖ హెచ్చరించింది. రైలు ప్రయాణ సమయంలో పూజల పేరిట దీపం, హారతి కర్పూరం తదితరాలను వెలిగిస్తే, కఠిన చర్యలు తప్పవని దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో హెచ్చరించింది. రైళ్లలో నిప్పు వెలిగించి పట్టుబడితే రూ. 1000 వరకూ జరిమానా, మూడు సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉందని తెలిపింది. అయ్యప్ప భక్తులు ప్రయాణించే రైళ్లలో సాధారణ ప్రయాణికులు కూడా ప్రయాణించడంతో వారి నుంచి రైల్వేశాఖకు పిర్యాదులు అందాయి.

దీంతో అలర్ట్ అయిన దక్షిణ రైల్వే శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల కోయంబత్తూరు మీదుగా వెళుతున్న స్పెషల్ రైలులో భక్తులు దీపం పెట్టడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వారిని మందలించి వదిలిపెట్టారు. ఈ తరహా చర్యలు వికటిస్తే ఘోర అగ్ని ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తున్న ఉన్నతాధికారులు, అగ్నిప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను తరలించడం శిక్షార్హమని తెలిపారు. రైళ్లలో హారతులు వెలిగిస్తే శిక్షలు తప్పవంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles