Prabas encroched land: telangana govt హీరో ప్రభాస్ అక్రమణదారుడే: తెలంగాణ సర్కార్

Hero prabas encroched govt land telangana govt to high court

Hero Prabhas, prabhas rayadurgam guest house, telangana government, High court, Telangana revenue officials

Telangana revenue officials clarifies that the bahubali hero had encrouched government land in a petition filed in High court. His Guest House had been seized recently at rayadurgam, RangaReddy district.

హీరో ప్రభాస్ అక్రమణదారుడే: హైకోర్టుకు తెలంగాణ సర్కార్ నివేదిక

Posted: 12/24/2018 02:56 PM IST
Hero prabas encroched govt land telangana govt to high court

టాలీవుడ్ హీరో ప్రభాస్ గెస్ట్ హౌజ్ వ్యవహారంలో రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాల మేరకు ఇవాళ తెలంగాణ రెవెన్యూ అధికారులు హైకోర్టులో తమ కౌంటరు దాఖలు చేశారు. హీరో ప్రభాస్ ప్రభుత్వ భూమిని అక్రమించుకున్నారని వారు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కోన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చెందిన గెస్ట్ హౌజ్ ను సీజ్ చేశామని కూడా వారు నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం.

శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గం సమీపంలో, సర్వే నంబర్‌ 5/3లో ప్రభాస్‌ కు చెందిన 2,083 చదరపు అడుగుల స్థలాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని చెబుతూ, అందుకు గల కారణాలను తమ పిటిషన్ లో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంపై బాహుబలి సమరశంఖం పూరించిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తన గెస్ట్ హౌజ్ ను తెలంగాణ రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై ఏకంగా హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్.. న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

తన స్థలం అంతా సక్రమంగానే వున్నా.. ఎలాంటి అక్షేపణలు భవిష్యత్తులో తలెత్తకుండా తాను ముందస్తుగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా భూమి క్రమబద్దీకరణకు సంబంధించి ఎల్ఆర్ఎస్ కు కూడా దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. ఇందుకోసం రూ. కోటి ఐదు లక్షలు కూడా వెచ్చించానని, దానిపై ఇంకా తెలంగాణ రెవెన్యూ అధికారుల నిర్ణయం వెలువడకముందే.. అధికారులు తన గెస్ట్ హౌజ్ ను సీజ్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ కేసును న్యాయస్థానం ఈ నెల 31కి వాయిదా వేసింది. మరి 31న ప్రభాస్ హైకోర్టు న్యూ ఇయర్ గిఫ్ట్ ను ఇస్తుందా.? లేక తెలంగాణ సర్కార్ కు అది దక్కుతుందా వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles