Strike, holidays to disrupt banking ops next week తస్మాత్ జాగ్రత్తా: బ్యాంకులకు వరుస సెలవులు..

Banks to remain shut for five days from dec 21 due to strikes holidays

strikes, holidays, banks, Christmas, United Forum of Bank Unions (UFBU), bank employees strike, banks strike, bank holidays

In the wake of strikes and holidays, banks will remain closed from Friday to Wednesday, except Monday, December 24 and the banking services could adversely be affected on these days..

తస్మాత్ జాగ్రత్తా: బ్యాంకులకు వరుస సెలవులు..

Posted: 12/20/2018 02:58 PM IST
Banks to remain shut for five days from dec 21 due to strikes holidays

మరోమారు బ్యాంకులకు వరసగా ఐదు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. బ్యాంకుల్లో పనులుంటూ ముందుగానే ముగించుకోకపోతే.. పర్యవసానాలు భరించాల్సి వస్తుంది. ఒకవైపు వరుస సెలవులు, మరోవైపు ఉద్యోగుల సమ్మెల కారణంగా శుక్రవారం నుంచి వచ్చే ఆరు రోజుల వ్యవధిలో బ్యాంకులు కేవలం ఒక్క రోజు మాత్రమే పనిచేయనుంది. మిగిలిన ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతబడనున్నాయి. ఇందులో నాలుగు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతబడనుండటంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగక తప్పదు.

సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ  ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీవోసీ) డిసెంబరు 21న సమ్మెకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆపై 22న నాలుగో శనివారం సందర్భంగా, ఆపై 23న ఆదివారం కారణంగా బ్యాంకులు పనిచేయవు. తరువాతి రోజైన సోమవారం నాడు బ్యాంకులు పని చేస్తాయి. మంగళవారం నాడు క్రిస్టమస్ సందర్భంగా బ్యాంకులకు మళ్లీ సెలవు కాగా, 26న యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్‌ సమ్మెకు పిలుపునిచ్చింది.

దీంతో 24వ తేదీని మినహాయిస్తే, మిగతా ఐదు రోజులూ బ్యాంకు సేవలకు ఆటంకం తప్పేలా లేదు. డిసెంబరు 21న జరిగే సమ్మెను బ్యాంకు యూనియన్లలో ప్రధానమైన ఏఐబీవోసీ పిలుపునివ్వగా, ఇందులో సుమారు 3.2 లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. దీంతో ఏటీఎంలు మినహా మరే సేవలూ అందే అవకాశాలు కనిపించడం లేదు. 26 నాటి సమ్మె ప్రభావం మాత్రం నామమాత్రంగానే ఉంటుందని బ్యాంకు సంఘాలు అంటున్నాయి. బ్యాంకులకు వరుస సెలవుల నేపథ్యంలో ఏటీయంలలో కూడా డబ్బులు కొరత ఏర్పడే అవకాశం వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles