Cyclone ‘Phethai’: Heavy rains likely in parts of State తీరం ధాటనున్న పెథాయ్.. తీరప్రాంతం అల్లకల్లోలం

Cyclone phethai heavy rains likely in parts of state

Phethai, Cyclone ‘Phethai’, machlipatnam, kakinada, bay of bengal, east godavari, indian meteorological department, Andhra pradesh

The cyclonic storm ‘Phethai’ formed over the Bay of Bengal, intensified further into a severe cyclone which is is expected to cross the Andhra Pradesh coast between Machlipatnam and Kakinada today afternoon.

తీరం ధాటనున్న పెథాయ్.. తీరప్రాంతం అల్లకల్లోలం

Posted: 12/17/2018 11:28 AM IST
Cyclone phethai heavy rains likely in parts of state

పెను తుపానుగా మారిన ‘పెథాయ్‌’‌ ఇవాళ మధ్యాహ్నం తీరం దాటనుంది. ప్రస్తుతం కాకినాడ‌కు 200 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మైన పెథాయ్, గంటకు 19 కి.మీ వేగంతో తూర్పుగోదావ‌రి జిల్లావైపు వేగంగా క‌దులుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని తుని-యానాంల మ‌ధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంట‌కు 100 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన బ‌ల‌మైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇప్పటికే తిత్లీ తుఫాను మిగిల్చిన విషాదం నుంచి ఇంకా కోలుకోని ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ప్రకృతి పగబట్టినట్లుంది. పెథాయ్‌ ప్రభావంతో తూర్పుగోదారి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకు 80 నుంచి 90 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. తీరం దాటే స‌మ‌యంలో పెనుగాలుల‌తో కూడిన వ‌ర్షం విరుచుకుపడనుందని.. ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
 
వ‌రి, జొన్న‌ త‌దిత‌ర ధాన్యాల‌ను కోసిన‌వారు వాటిని త‌క్ష‌ణం గోదాముల్లో భ‌ద్ర‌ప‌రచాలని సూచించారు. పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపైన టార్పాలిన్ ప‌ట్ట‌లు క‌ప్పి భ‌ధ్ర‌ప‌ర‌చాలని.. వ్య‌వ‌సాయ శాఖ అధికారుల నుంచి రైతులు వీటిని పొంద‌వ‌చ్చని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో ఉంటున్నవారిని అధికారులు పున‌రావాస కేంద్రాల‌కు తరలిస్తున్నారు. తుపాను తీరం దాటే వ‌ర‌కు ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్దని సూచించారు. ముఖ్యంగా తూర్పు గోదావ‌రి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

పెథాయ్ తుపాను పలు రైళ్లు, బస్సులు రద్దు

పెథాయ్ తుపాను ప్రభావం గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలపై అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాలలో నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. ఇక ఇదే సమయంలో అర్టీసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అమలాపురం, కాకినాడ, తెనాలి సహా పలు ప్రాంతాల్లో అర్టీసీ సేవలను రద్దు చేశారు. ఇక పలు గుంటూరు, తెనాలి, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ పోర్టు, రాజమండ్రిల మధ్య నడిచే అన్ని మెము ప్యాసింజర్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. వీటితో పాటు భీమవరం, రాజమండ్రి, నిడదవోలు, విజయవాడ, నర్సాపూర్‌, గుంటూర్ల మచిలీపట్నం మధ్య నడిచే డెము ప్యాసింజర రైళ్లు రద్దయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Phethai  Cyclone ‘Phethai’  machlipatnam  kakinada  bay of bengal  east godavari  Andhra pradesh  

Other Articles