Chamarajnagar temple poison victims recovering: Docs 12 మందిని బలిగొన్న ప్రసాదంలో.. పురుగుల మందు..

Two people arrested in karnataka temple prasad poisoning incident

Sulvadi temple, Kichchugutti Maramma temple, charamajanagar temple, Hanur taluk, pesticide in prasadam, dome inauguration, gopuram inauguration, poison in prasadam, karnataka tragedy, karnataka, crime

Two people have been arrested in connection with the Karnataka temple food poisoning, the district in-charge minister of Charamajanagar Puttaranga Shetty said on Saturday, 15 December.

12 మందిని బలిగొన్న ప్రసాదంలో.. పురుగుల మందు..

Posted: 12/15/2018 10:58 AM IST
Two people arrested in karnataka temple prasad poisoning incident

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో 12 మందిని బలితీసుకున్న ప్రసాదంలో క్రిమిసంహారక మందు కలసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పురుగుల మందు కలసిన ప్రసాదాన్ని సేవించిన భక్తులు 12 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన మాజీ గ్రామసర్పంచ్ తోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు మరియమ్మ ఆలయంపై గ్రామంలోని రెండు కుటుంబాల మధ్య అధిపత్య పోరు ముదిరి.. 12 మంది ప్రాణాలను బలిగొనింది.

సులివాడి గ్రామంలోని కిచ్చుగుత్తి మారెమ్మ ఆలయం పగ్గాలను చేపట్టిన ఓ వర్గం.. ఆలయానికి గోపుర శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వందలాదిగా భక్తులు తరలివచ్చారు. గోపుర పూజ అనంతరం భక్తులకు ప్రసాదం పంచిపెట్టారు. అయితే, అప్పటికే ప్రసాదంలో విషయం కలవడంతో అది తిన్న తర్వాత భక్తులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని వైద్యం కోసం స్థానిక హాస్పిటల్‌కు తరలించగా 12 మంది మృతి చెందారు. భక్తులకు మరింత మెరుగైన వైద్యం కోసం మైసూరు ఆస్పత్రికి తరలించారు. విచారణ చేపట్టిన అధికారులు ప్రసాదంలో విషం కలిపినట్టు గుర్తించారు.

ఆలయంపై మరో కుటుంబం ఆధిపత్యం చేలాయించడం ఇష్టంలేని వారి బంధువు, గ్రామ మాజీ సర్పంచ్ ఇందులో ప్రధాన నిందితుడు. ఆలయ గోపుర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తోన్న గ్రామంలోని మరో వర్గమే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాధమికంగా నిర్ధరించారు. ఆలయ నిర్మాణాన్ని ఈ వర్గం వ్యతిరేకించగా, మరో వర్గం మాత్రం పట్టుబట్టి మరీ వేడుకను నిర్వహించింది. దీంతో మరింత ఆగ్రహించిన ప్రత్యర్థులు ప్రసాదంలో క్రిమి సంహారక మందును కలిపి 12 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు.

మారెమ్మ ఆలయ నిర్మాణ బాధ్యతలను చిన్నప్పి అనే వ్యక్తి తీసుకోవడంతో ఇది ఇష్టంలేని ఆయనకు వరుసకు సోదరుడయ్యే దేవనట్టి మరో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గ్రామస్థులు తెలిపారు. పోలీసుల కూడా వీరిపైనే అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దేవనట్టి, మహాదేశ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తోన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపారు. ఘటన గురించి తెలియగానే కర్ణాటక సీఎం కుమారస్వామి హుటాహూటీన అక్కడకు చేరుకున్నారు. బాధితులను మెరుగైన వైద్యం కోసం మైసూర్ తరలించాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles