polling instructions issued by election commission ఓటు వేసేందుకు మొబైల్ ఫోన్ ఎందుకు.?

Polling instructions issued by election commission

telangana elections 2018, Telangana assembly elections, polling stations, presiding officers, polling agents, TRS, Congress, Maha kutami, BJP, Independents, Telangana Politics

Inspite of Telangana assembly elections, election commission issued instutions to presiding officers and others invoving in election duties.

ఓటు వేసేందుకు మొబైల్ ఫోన్ ఎందుకు.? ఎన్నికల నియమావళిని ఇదే..

Posted: 12/06/2018 12:29 PM IST
Polling instructions issued by election commission

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు ఎన్నికల సంఘం అధికారుల. మరికొన్ని గంటల వ్యవధిలో తెలంగాణలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సగటు ఓటర్లకు, బరిలో నిలిచిన అభ్యర్థులలో తలెత్తే పలు అంశాలపై క్లారిటీని ఇచ్చింది ఎన్నికల సంఘం. పోలింగ్ కేంద్రంలోకి ఎవరెవరికి ప్రవేశం ఉంటుంది? ఎంతమంది ఒకేసారి వెళ్లవచ్చు? వంటి అంశాల విషయంలో ఎన్నికల సంఘం నియమావళిని విడుదల చేసింది.

పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించిన వ్యక్తులకు మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఈ జాబితాలో ఎన్నికల సంఘం ద్వారా అనుమతించిన వారు కొందరు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అనుమతించేవారు ఇంకొందరు ఉంటారు. ఒకేసారి ఎంత మంది ఓటర్లను అనుమతించాలన్న అధికారం ప్రిసైడింగ్ ఆఫీసర్ చేతుల్లో ఉంటుంది. పోలింగ్‌ ఆఫీసర్లు, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, ఎన్నికల సంఘం అనుమతించిన వ్యక్తులు లోనికి వెళ్లవచ్చు.

ఆ నియోజకవర్గంలో పోటీ పడే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, పోలింగ్‌ ఏజెంట్లు వెళ్లవచ్చు. ఓటు వేయడానికి వచ్చే వారు, చంకలో ఉండే చంటిబిడ్డలు, అంధులు, వృద్ధులకు తోడుగా వచ్చినవారు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నియమించబడిన వ్యక్తులు లోనికి వెళ్లొచ్చు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ అధికారులు హెచ్చరించారు.

అయితే పోలింగ్ రోజున ఓటు వేసే ఓటర్లు, సిబ్బంది పోలిగ్ స్టేషన్లో మాత్రం మొబైల్ ఫోన్ ను వినియోగించరాదన్న అదేశాలు వచ్చాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు మొబైల్ ఫోన్ తీసుకురావద్దని ఆదేశించింది. పోలింగ్ సిబ్బంది కూడా ఫోన్ తీసుకువెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బందికి ఫోన్‌ అత్యవసరమైతే ప్రిసైడింగ్ అధికారి అనుమతితో ఫోన్‌ తీసుకువెళ్లాలని తెలిపారు. పోలీసులు కూడా ప్రిసైడింగ్ అధికారి అనుమతి ఇస్తేనే పోలింగ్ కేంద్రంలోని వెళ్లాలని ఈసీ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles