Tensions in seri lingampally and andole constituencies శేరిలింగంపల్లి, అందోల్ నియోజకవర్గాల్లో అర్థరాత్రి టెన్షన్..

Telangana elections 2018 tensions in seri lingampally and andole constituencies

telangana elections 2018, Telangana assembly elections, seri lingampally, papireddy colony, bhavya anand prasad, kranti kiran, jogipet, rahul kiran, Congress, Maha kutami,TRS, Congress, Maha kutami, Telangana Politics

Telangana Elections 2018G Amid elections tensions prevailed in seri lingampally and andole constituencies alleging that opposition parties are distributing money to voters.

శేరిలింగంపల్లి, అందోల్ నియోజకవర్గాల్లో అర్థరాత్రి టెన్షన్..

Posted: 12/06/2018 10:45 AM IST
Telangana elections 2018 tensions in seri lingampally and andole constituencies

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని గంటల్లో తెరలేవనున్న క్రమంలో.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ప్రలోభాలకు తెరతీశాయి. మరీ ముఖ్యంగా పేదలు, బడుగు బలహీనవర్గాల అవాసాలు వుండే ప్రాంతంలో మద్యం, మనీ పంపకాలు జరుగుపుతన్నాయి. అటు ఈసీ అధికారులు, ఇటు ప్రత్యర్థి పార్టీల కంట పడకుండా అర్ధరాత్రి వేళలను తమకు అనుకూలంగా మార్చకుంటూ నగదు పంపకానికి రాజకీయ పార్టీలు దిగుతున్నాయి.

తాజాగా హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో నిన్న అర్ధరాత్రి సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహాకూటమి అభ్యర్థులు నగదును పంచుతున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో మహాకూటమి అభ్యర్థికి మద్దతుగా టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ఇరువర్గాలు పరస్పరం దాడిచేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు.

మరోవైపు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్‌ తమ్ముడు రాహుల్ కిరణ్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు పంచుతున్నాడంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు త్వరగా రాకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలే వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు ముష్టిఘాతాలు కురిపించుకున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

అయితే డబ్బు పంపకాలను చేస్తున్న టీఆర్ఎస్ వారిని తాము నిలువరిస్తే.. వారు దాడులకు దిగడంతో.. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తిరగబడ్డారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం తలపడ్డాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారనీ, వారిని పట్టించుకోకుండా తమను వేధిస్తున్నారని నిరసన తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. సంగారెడ్డి డీఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : seri lingampally  jogipet  TRS  Congress  Maha kutami  Telangana Politics  Telangana Politics  

Other Articles