Key findings in the Uttar Pradesh pre-poll survey యూపీ ప్రీఫోల్ సర్వే: మహాకూటమి ఏర్పడితే కమలానికి ముప్పే

Mahagathbandhan if formed to get majority seats in up pre poll survey

uttar pradesh general elections 2019, Uttar Pradesh Parliament elections, Times Now-CNX, UP Parliament pre-poll survey, Opinion Poll, Exit poll, Pre-poll survey, Narendra Modi, BJP, Rahul Gandhi, Congress, Akhilesh Kumar Yadav, SP, Mayawati BSP, UP politics

As the semi-final phase of elections is around the corner, here are the key findings in the Uttar Pradesh pre-poll survey.

యూపీలో మహాకూటమి ఏర్పడితే మోడీ ఆశలను పటాపంచలు: సర్వే

Posted: 11/30/2018 12:36 PM IST
Mahagathbandhan if formed to get majority seats in up pre poll survey

ఉత్తర్ ప్రధేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో మహాఘట్ బంధన్ ఏర్పడకుండా అధికార బీజేపి తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తుంది. అందుకనే మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ మహాకూటమి నుంచి తప్పకుంటానని సంకేతాలు కూడా ఇస్తున్నారంటే ఇది ఆ ప్రయత్నాల ఫలమేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే అత్యధికంగా 80 పార్లమెంటు స్థానాలు వున్న ఉత్తర్ ప్రదేశ్ లో ప్రస్తుతం 73 అధికార బీజేపి పార్టీకి కైవసం చేసుకుంది. అయితే తాజాగా రాజకీయ కూటములు ఏర్పడనున్నాయన్న సంకేతాలతో మహాకూటమి ఏర్పడింతే బీజేపి బలం సగానికి పైగానే తగ్గిపోతుందని తాజా ప్రీపోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

దీంతో ఇక్కడ తమ బలం, పట్టు కోల్పోకూడదని.. ఢిల్లీలో మళ్లి చక్రం తిప్పాలంటే ఇక్కడ మెజారిటీ సీట్లు తమే సాధించాలని బీజేపి ప్రయత్నాలు చేస్తుంది. ఆదే ఫలితం రానున్న 2019 ఎన్నికలలో కూడా పునరావృతం కావడానికి కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. అయితే, ఉత్తర్‌ప్రదేశ్ లో విపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ ఆశలు గండిపడక తప్పదని 'టైమ్స్ నౌ - సీఎన్ఎక్స్ ' తాజా సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి, ప్రతిపక్షాలు విడివిడిగా పోటీచేస్తే బీజేపీ 49 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వేలో వెల్లడయ్యింది. అంటే, 2014తో పోలిస్తే ఇవి 24 సీట్లు తక్కువన్నమాట. ఇదే సమయంలో ఎస్పీ, బీఎస్పీలకు చెరో తొమ్మిది, కాంగ్రెస్ కు 5, ఇతరులకు 2 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది.

కానీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీలు కూటమిగా ఏర్పడితే ఎన్డీఏకు తలనొప్పి తప్పదని అంచనా వేసింది. మహాఘట బంధన్‌గా ఏర్పడితే కూటమి 49 సీట్లను దక్కించుకుంటుందని, బీజేపీ 31 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. అలా కాకుండా ఎస్పీ, బీఎస్పీలు మాత్రమే కలిసి పోటీ చేస్తే 33 స్థానాల్లోనూ, బీజేపీ 45 స్థానాల్లో, కాంగ్రెస్‌ రెండు చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ప్రధాని అభ్యర్థిగా మాత్రం మోదీకి 42 శాతం మంది మద్దతు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని 20 శాతం మంది కోరుకోగా, 11 శాతంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అలాగే 16 శాతం మంది కొత్త వ్యక్తి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అచ్చే దిన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే భావన వ్యక్తమవుతోంది. మోదీ రాకతో మంచి రోజుల వచ్చాయని 52 శాతం మంది అభిప్రాయపడగా, 30 శాతం మంది ఎలాంటి మార్పులేదని, 17 శాతం మంది ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అంతేకాదు, ఆర్థిక అంశాలకే ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని 74 శాతం మంది అభిప్రాయపడగా, రామమందిరం అంశం ప్రభావం చూపుతుందని 11 శాతం మంది, రాఫెల్ ఒప్పందం కూడా కీలక కానుందని 10 శాతం మంది భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Times Now-CNX  pre-poll survey  Parliament elections  mahagathbandhan  Uttar Pradesh  Politics  

Other Articles