Vote a weapon, use carefully: Rahul తెలంగాణ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకం: రాహుల్ గాంధీ

Telangana polls rahul gandhi dubs trs as telangana rashtra sangh parivar

rahul gandhil, praja front, chandrababu, suravaram sudhakar reddy, khamam,praja front convenor, kodandaram, election promises, 100 units free power, 6 subsidy gas cylinders, 1 lakh grant to dwacra groups, Telangana, politics

Congress President Rahul Gandhi, who is on his third visit to poll-bound Telangana, on Wednesday launched a fresh attack against ruling Telangana Rashta Samiti (TRS), labelling it the ‘Telangana Rashtriya Sangh Parivar.'

తెలంగాణ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకం: రాహుల్ గాంధీ

Posted: 11/28/2018 05:41 PM IST
Telangana polls rahul gandhi dubs trs as telangana rashtra sangh parivar

తెలంగాణ ఎన్నికలు దేశ భవిష్యత్ కు ఎంతో కీలకమైనవని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం ఒకవైపు వుండగా, రాష్ట్రంలోని రైతులు, యువకులు, ప్రజలు మరోవైపు ఉన్నారని అన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి గెలిచిన తర్వాత.. దేశంలో మోదీపై పోరాడేందుకు ఇదే కూటమి దిక్సూచిగా నిలుస్తుందని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో మోదీకి సంబందించిన బీ టీమ్ తో మనం పోటీ పడుతున్నాం. మోదీ బి-టీమ్‌ అయిన టీఆర్ఎస్ ను ఓడించాలి. ఆ తర్వాత కేంద్రంలో మోదీ ఏ టీంను ఓడించి దేశ ప్రజలకు నోట్ల రద్దు, జీఎస్టీ, ధరఘాతాల నుంచి విముక్తి చేస్తామని రాహుల్ అన్నారు.

ఖమ్మంలో ప్రజా కూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గోన్న ఆయన ఖమ్మం జిల్లా సహా తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే.. తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రావడం తథ్యమనిపిస్తోందని రాహుల్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. కేంద్రంలో మోదీ ఒక్కో వ్యవస్థను నాశనం చేస్తూ వస్తున్నారని.. సుప్రీంకోర్టు, సీబీఐ, ఆర్బీఐ, ఈసీ.. ఇలా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. తెలంగాణకు వచ్చిన ప్రధాని టీఆర్ఎస్ను కాంగ్రెస్ తో పాల్చారు.

అయితే అదే టీఆర్ఎస్ మద్దుతును ఉభయసభల్లో అన్ని విషయాల్లో ఎందుకు తీసుకున్నారని రాహుల్ ప్రశ్నించారు. ఇక టీఆర్ఎస్ అనేక విషయాల్లో మోదీకే కేసీఆర్‌ మద్దతు పలికారు. అవిశ్వాసం సమయంలోనూ కేసీఆర్‌ మోదీకే మద్దతిచ్చారు. కాంగ్రెస్ ‌మాత్రం భాజపాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వస్తోంది. భాజపా కూటమిలో ఉన్న తెరాసను ప్రజా కూటమి ఇప్పుడు ఓడించేందుకు సిద్ధమైంది’

టీఆర్ఎస్.. టీఆర్ఎస్ఎస్ గా మారిపోయింది..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రెండు రాష్ట్రాలు చల్లగా వుండాలని రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పలు హామీలను ఇచ్చారని రాహుల్ చెప్పారు. అయితే ఈ హామీలను మోదీ సర్కారు ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు, విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకిచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నా.. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మోడీ భజన చేస్తూ తమ పార్టీని టీఆర్ఎస్ఎస్ గా (తెలంగాణ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)గా మారిపోయిందని విమర్శించారు. విభజన చట్టంలోని ఏ ఒక్కహామీనీ నెరవేర్చని ప్రధానిని కేసీఆర్‌ ఎందుకు నిలదీయడం లేదని ఆయన నిలదీశారు.

కాంగ్రెస్ ప్రాజెక్టులకు పేర్లు మార్చి దోపిడీ

‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ కావాలని ఉద్యమించిన కేసీఆర్.. నాలుగున్నరేళ్ల కాలంలో ఎవరికి ఏం చేశారో చెప్పాలని ఇచ్చారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రాజెక్టులకు రీడిజైన్‌ చేసి.. దోపిడికి తెలివిగా తెరలేపారని రాహుల్ అరోపించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును రూపకల్పన చేసింది. అయితే ఆ ప్రాజెక్టుకు పేరు మార్చి రూ.50 వేల కోట్ల వ్యయంతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు అంచనాలు పెంచి.. రూ.90 వేల కోట్లకు చేర్చారు. ప్రాజెక్టు పేర్ల మార్పు కోసమే కేసీఆర్‌ రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది. కేసీఆర్‌ ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రతి కుటుంబంపై రూ.2 లక్షల మేర అప్పుభారం పడిందని రాహుల్ అరోపించారు.

రూతులకు సంకెళ్లు వేసిన ప్రభుత్వం

తెలంగాణ రైతులు తమకు మద్దతు ధర కావాలని నినదిస్తే వారికి బంధిపోటు దోంగలకు వేసినట్లుగా రైతులకు సంకెళ్లు వేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రైతులకు సాగునీళ్లు ఇస్తామని, ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని గ్రామాల్లో చెప్పిన కేసీఆర్ ఏం నాలుగున్నరేళ్లుగా ఏం చేసిందని ప్రశ్నించారు. దళితులకు మూడు ఏకరాల భూపంఫిణీ అప్పుడే పూర్తైయ్యిందా.? తెలంగాణలో ప్రతీ దళిత కుటుంబానికి మూడెరరాల భూమి అందిందా.? అని ప్రశ్నించారు.

ఇక తెలంగాణ కోసం ఉద్యమించిన యువతకు ఇంటికో ఉధ్యోగం ఇస్తామని మాయమాటలు చెప్పిన కేసీఆర్‌ మళ్లీ మీ ముందకు మాయ చేయడానికి వస్తున్నాడు. ఆయన మాయలో ఎవరో పడవద్దని రాహుల్ గాంధీ సూచించారు. గత నాలుగున్నరేళ్లుగా కేసీఆర్ కుటుంబానికి మినహా యువతకు ఉద్యోగాలు రాలేదు. తెలంగాణలో అర్హులైన యువతకు ప్రభుత్వ ఉద్యోగం లభించిందా.? కనీసం వెయ్యి ఉద్యోగాలైనా నియామాకాలు చేశారా.? అని ప్రశ్నించారు. జిల్లాల పునర్విభజన చేసినా.. ఉద్యోగాల భర్తీ మాత్రం కాలేదని.. ఇదెక్కడి ప్రభుత్వమని ఆయన ప్రశ్నించారు.

మధ్యప్రధేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్ తో పాటుగా తెలంగాణలో కూడా ప్రజాకూటమికి అధికారంలోకి వస్తుందని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. మద్దతు ధర అడిగిన రైతులపై లాఠీఛార్జ్‌ చేసిన కేసీఆర్ కావాలా.. చెప్పిన మాటకు కట్టుబడి 2014లో రైతుల రుణాలను మాఫీ చేసిన కాంగ్రెస్ కావాలా అలోచించుకోవాలని సూచించారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే రైతులకు మరోమారు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రతి మహిళా సంఘానికి రూ.లక్ష గ్రాంటుగా ఇస్తామన్నారు. కేసీఆర్‌ 2 లక్షల మందికి రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తామని.. కనీసం 5 వేలు ఇళ్లు కూడా నిర్మించలేదని అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి చరమగీతం పాడాలని రాహుల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhil  praja front  chandrababu  suravaram sudhakar reddy  khamam  telangana  politics  

Other Articles