BJP tops TV ads, Congress demands EC probe టీవీ ప్రకటనల్లో పంబరేపిన బీజేపి.. వారం రోజుల్లో 22వేల సార్లు..

Ahead of polls bjp becomes the number one advertiser on television

Bharatiya Janata Party, amazon video, trivago, hindustan unilever, Netflix, Election commission, five state elections. Congress, chattisgarh, mizoram, rajasthan, madhya pradesh, Telangana, Politics

The Bharatiya Janata Party became the number one advertiser on television in the run-up to assembly elections in five states,

టీవీ ప్రకటనల్లో పంబరేపిన బీజేపి.. వారం రోజుల్లో 22వేల సార్లు..

Posted: 11/23/2018 03:32 PM IST
Ahead of polls bjp becomes the number one advertiser on television

ఇప్పటికే ఓ వైపు దేశంలోని స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన ప్రతిష్టాత్మక సంస్థలను బీజేపి పార్టీ తమ అదుపాజ్ఞనల్లోకి తీసుకుందని అరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా బీజేపి ప్రభుత్వం అదుపాజ్ఞల్లోనే వుందని ఇప్పటికే పలు ఘటనల ద్వారా నిరూపితమైందని ప్రతిపక్షాలు అరోపిస్తు్న్నాయి. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కూడా బీజేపి అవలంభిస్తున్న మీడియా ప్రకటనలపై కూడా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదన్న అరోపణలు వినబడుతున్నాయి.

దేశంలో టీవీ ప్రకటన ద్వారా ప్రచారం చేయడంలో నెంబర్ వన్ ఎవరు? జవాబు భారతీయ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు మాత్రం కాదు. ఒక రాజకీయ పార్టీ టీవీ ప్రకటనల్లో అగ్రభాగాన నిలిచింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో బీజేపీ టీవీ ప్రకటనల జోరు పెరిగింది. ప్రచార ప్రకటనల్లో బడా బడా కంపెనీలనే వెనక్కి నెట్టేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీవీ ప్రకటనల్లో టాప్ 10 బ్రాండ్లలో ప్రముఖ విపక్ష పార్టీ కాంగ్రెస్ లేదు. ఈ విషయాన్ని బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ (బార్క్) తన రిపోర్ట్ లో తెలిపింది. బార్క్ కొత్త రిపోర్ట్ ప్రకారం నవంబర్ 16కి ముగిసిన వారంలో విమల్ పాన్ మసాలా బాగా వెనుకబడి పోయింది.

22,099 సార్లు బీజేపీ ప్రకటనలు
ఎకనామిక్ టైమ్స్ లో ప్రచురించిన వార్త మేరకు నవంబర్ 10 -16 వారంలో టీవీలో ప్రసారమైన ప్రకటనల్లో బ్రాండ్ కంపెనీల కంటే ఎక్కువగా  బీజేపీ ప్రకటనలే కనిపించింది. ఆ తర్వాత స్థానాల్లో నెట్ ఫ్లిక్స్, ట్రివాగో ఉన్నాయి. ఈ వారం టీవీలో మొత్తం 22,099 సార్లు బీజేపీ ప్రకటనలు దర్శనమిచ్చాయి. ఆ తర్వాత 12,951 సార్లు నెట్ ఫ్లిక్స్ యాడ్ కనిపించింది. 12,795 యాడ్స్ తో ట్రివాగో మూడో స్థానంలో నిలిచింది.

నెంబర్ 1, 2 మధ్య 9,000 తేడా
టీవీలో యాడ్ ఇచ్చే విషయంలో దేశంలోని మిగతా పార్టీల కంటే బీజేపీ ఎంత ముందు ఉందో ఈ అంకెలే చెబుతాయి. నెంబర్ 2గా ఉన్న నెట్ ఫ్లిక్స్ కి బీజేపీకి మధ్య 9,000 తేడా ఉంది. ప్రకటనల విషయంలో సంతూర్ సబ్బు 11,222 సార్లు కనిపించి నాలుగో స్థానంలో ఉంది. గత వారం టీవీ ప్రకటనల్లో రెండో స్థానంలో ఉన్న బీజేపీ ఈ వారం అమాంతంగా భారీ తేడాతో మొదటి స్థానం సాధించింది.

టాప్ 10లోని మిగతా ప్రకటనకర్తల విషయం చెప్పాలంటే డెట్టాల్ (9,487) 5వ స్థానం, వైప్ (9,082) 6వ స్థానం, కోల్గేట్ డెంటల్ క్రీమ్ (8,938) 7వ స్థానం, డెట్టాల్ టాయిలెట్ సోప్ (8,633) 8వ స్థానం, అమెజాన్ ప్రైమ్ వీడియో (8,031) 9వ స్థానం, రూప్ మంత్ర ఆయూర్ ఫేస్ క్రీమ్ (7,962) 10వ స్థానంలో ఉన్నాయి. దీంతో ఐదు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, రాజస్థాన్ లలోని ప్రతిపక్షాలు ఈ ప్రకటనలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రాల ఎన్నికల సంఘాలు సంయుక్తంగా దీనిపై విచారణ సాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  BJP  TV Ads  five state Elections  Election commission  brands  elections  

Other Articles