తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగేళ్లలో ఎంత అభివృద్ది చేశామో చూశారా.. అంటూ అధికార పార్టీ.. రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారని ప్రతిపక్షాలు ఓ వైపు చర్చనడుస్తున్న క్రమంలో.. ఓటర్లు మాత్రం ఇన్ని చెబుతున్న నేతలు, తమ ఆస్తులను ఎంతగా పెంచుకున్నారని చర్చిస్తున్నారు. ఐదేళ్లు కావస్తున్నా తమ జీవితాల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా వుంటే నాయకులు మాత్రం అభివృద్ది అంటూ ఉత్తమాటలు చెబుతున్నారన్న విమర్శలు ఓ వైపు వినబడుతున్నాయి.
ఇక ప్రతిపక్ష నేతలు చెబుతున్నట్లు మిగులు నిధులు వున్న రాష్ట్రాన్ని, ఏడాదికి సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వున్నా.. అది చాలదన్నట్లు మరో రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులను చేసి ప్రజల నెత్తిపై భారం పెట్టారని.. ఈ నిధులకు కట్టే వడ్డీ ప్రజల సోమ్ము అని మర్చిపోయారా అంటూ అరోపణలు చేస్తూనే వున్నారు. ఈ క్రమంలో ఎవరెన్ని చెప్పినా.. ఏ నేత ఎంతలా అస్తులను అర్జించాడన్నదానిపై ఓటర్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో తెలంగాణ మాజీ అరోగ్యశాఖ మంత్రి లక్ష్మరెడ్డి అమాంతం లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల్లోకి పడగెత్తాడు. అంతేకాదు మరికొందరు నేతలు కూడా ఏకంగా తమ పదుల కోట్లలో వున్న ఆస్తులను ఏకంగా నలబై ఆపైన సంపాదించారు. ఇదంతా జస్ట్ ఇన్ ఫైవ్ ఇయర్స్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఆస్తులు గణనీయంగా పెరిగినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అస్తులు మాత్రం తరగడం గమనార్హం.
ముఖ్య నేతల ఆస్తులు గత ఐదేళ్లలో ఎంతకు పెరిగాయంటే..
పేరు పార్టీ నియోజకవర్గం 2014లో ఆస్తులు 2018లో ఆస్తులు పెరుగుదల శాతం
కేసీఆర్ టీఆర్ఎస్ గజ్వేల్ రూ.15.15 కోట్లు రూ.23.55 కోట్లు 55.38
కేటీఆర్ టీఆర్ఎస్ సిరిసిల్ల రూ.7.98 కోట్లు రూ.41.82 423
ఈటల రాజేంద్ర టీఆర్ఎస్ హుజురాబాద్ రూ.14.51 కోట్లు రూ.42.41 కోట్లు 192
లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ జడ్చర్ల రూ.77 లక్షలు రూ.17.29 కోట్లు 2130
హరీష్ రావు టీఆర్ఎస్ సిద్దిపేట రూ.2.96 కోట్లు రూ.11.44 కోట్లు 285
జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ సూర్యాపేట్ రూ.1.13 కోట్లు రూ.3.53 కోట్లు 209
తలసాని టీఆర్ఎస్ సనత్ నగర్ రూ.15.56 కోట్లు రూ.40.30 కోట్లు 158
మర్రి జనార్థన్ రెడ్డి టీఆర్ఎస్ నగర్ కర్నూల్ రూ.111 కోట్లు రూ.161 కోట్లు 148
ఉత్తమ్ కుమార్ కాంగ్రెస్ హుజూర్ నగర్ రూ.3.11 కోట్లు రూ.3.07 కోట్లు -1.44
జానారెడ్డి కాంగ్రెస్ నాగార్జున సాగర్ రూ.8.56 కోట్లు రూ.10.99 కోట్లు 28
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కొడంగల్ రూ.13.12 కోట్లు రూ.21.39 కోట్లు 62
గీతా రెడ్డి కాంగ్రెస్ జహీరాబాద్ రూ.20.80 కోట్లు రూ.43.76 కోట్లు 110
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ మునుగోడు రూ.66.65 కోట్లు రూ.314 కోట్లు 371
కిషన్ రెడ్డి బీజేపీ అంబర్‌పేట్ రూ.6.44 కోట్లు రూ.8.23 కోట్లు 44
కె.లక్ష్మణ్ బీజేపీ ముషీరాబాద్ రూ.4.37 కోట్లు రూ.7.30 కోట్లు 46
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more