Ignore traffic rule, lose licence for 3 months రేఖ ధాటితే.. 3 నెలల కారాగారవాసమే..

3 month license suspension for traffic rules violation

Regional Transport Office, overspeeding, jumping signal, drunk driving, mobile phone driving, Ferrying passengers, Driving overloaded vehicle, lose licence for 3 months, Ignore traffic rule, Traffic rules, offensive, Maharashtra police, Maharashtra, crime

Motorists caught overspeeding, talking on the phone, jumping signal or drunk driving may soon get their driving license suspended for not less than three months, a move aimed at reducing the number of fatalities on state roads.

రైడర్స్ తస్మాత్ జాగ్రత్త: రేఖ ధాటితే.. 3 నెలల కారాగారవాసమే..

Posted: 11/19/2018 05:26 PM IST
3 month license suspension for traffic rules violation

తస్మాత్ జాగ్రత్త వాహనదారులు.. మీ కోసం కొత్తగా చట్టాలు వచ్చేశాయి. ఇన్నాళ్లు మీరు ఏమవుతుందిలే అనుకుని వదిలేస్తే.. ఇప్పుడు అసలుకే ఎసరు వస్తుంది. అదేటి అంటారా.. ఇకపై ట్రాఫిక్ పోలీసులు నిబంధనల రేఖను దాటితే కానీ దీని అంతరార్థం మీకు అనుభవం కాదు. మీరేం చెబుతున్నారు అంటారా.. ఇకపై మీరు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే.. మీ డ్రైవింగ్ లైసెన్సు మూడు నెలల పాటు రద్దు అవుతుంది. ఇదే మూడు పర్యాయాలు పునరావృతం అయితే ఏడాది పాటు.. అయితే ఏం అనుకుంటున్నారా.. ఇంత జరిగినా మళ్లీ పునరావృతం అయితే మీ లైసెన్సు వున్నా లేనట్టే.

ఔనా ఇంత కఠిన శిక్షలా.. సెల్ ఫోన్ వాడితే.. అనుకుంటున్నారా.? అయితే ఇవి మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసుల కొత్త నిబంధనలు. మహారాష్ట్రాలో గత సంవత్సరం 35,800 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, ఈ ప్రమాదాల్లో 12,200 మంది మరణించారు. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన వారి డ్రైవింగ్ లైసెన్సును మూడు నెలల పాటు రద్దు చేసి, వారు స్టీరింగ్ పట్టుకోకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

ముంబయి- పూణే ఎక్స్ ప్రెస్ వేపై దీనిపై ప్రచారోద్యమం చేపట్టారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, డ్రంకెన్ డ్రైవింగ్, జంపింగ్ సిగ్నల్స్, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, సరకుల వాహనంలో ఓవర్ లోడ్ చేయడం, కెపాసిటీ కంటే ప్రయాణికులను అధికంగా ఎక్కించుకోవడంపై జరిమానాలు విధించాలని నిర్ణయించారు. డ్రైవర్లను చైతన్యవంతులను చేసేందుకు తాము ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని ట్రాఫిక్ పోలీసులు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : overspeeding  jumping signal  drunk driving  mobile phone driving  police  crime  

Other Articles