వంద చేతిలో పెడతారా.? తిరగబడ్డ కార్యకర్తలు party activists protest over payments

Party activists protest over payments in choppadandi constituency

TRS activists, protest, Trs public meeting, Rs 100 instead of Rs 300, sunke ravi shanker, Bodiga Shobha, Choppadandi Campaign, telangana, politics

Telangana ruling party TRS activists protest after attending a public meeting in the constituency, demanding to give the said money instead party leaders gave rs 100 per head.

ITEMVIDEOS: రూ. 300 ఇస్తామని.. వంద మాత్రమే ఇస్తారా.? తిరగబడ్డ కార్యకర్తలు

Posted: 11/19/2018 02:59 PM IST
Party activists protest over payments in choppadandi constituency

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు నాయకులు లేదా ఎన్నికల బరిలో నిలిచిన పార్టీల అభ్యర్థులు దండాలు పెట్టడం మొదలు అనేక పనులు చేస్తూ.. అటు ఫోటోలకు ఫోజులివ్వడంతో పాటు.. ఇటు ఆ కులానికి చెందిన తటస్థ ఓట్లను కూడా తమవైపుకు అకర్షించే ప్రయత్నాలు చేస్తారు. ఆఖరికి ఎన్నడూ చేయని పనులు కూడా నైపుణ్యమున్నవారిలా చేసేస్తారు. మిర్చీబండ్ల వద్దకెళ్లి మిర్చీబజ్జీలను కూడా వేస్తారు. అందుకే పాత్రికేయ నిపుణులు.. ఎన్నికల చిత్రాలు చూడరో ఎనెన్ని చిత్రాలో.. అంటూ కాప్షన్లు పెట్టి మరీ వీటిని ప్రచురిస్తుంటారు.

అయితే ఇదే ఎన్నికల వేళ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యే అభ్యర్థుల నడుమ ఓటర్లను దూరం చేసుకునే విధంగా ఈ అభ్యర్థి చర్యలు వున్నాయని అక్కడి పార్టీ కార్యకర్తలు అడిపోసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం అధికార టీఆర్ఎస్ పార్టీపై మండిపడుతున్నారు. ఎందుకిలా.. అసలేం జరిగిందీ.. ఇంతకీ అక్కడి ఓటర్లు విమర్శలను గుప్పించినది ఎవరిపైన.. అన్న వివరాల్లోకి వెళ్తే.. టీఆర్ఎస్ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుంకె రవిశంకర్ నేనని అర్థమైంది.

చొప్పదొండి టీఆర్ఎస్ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే శోభను కాదని దక్కించుకున్న రవిశంకర్.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన నియోజకవర్గ పరిధిలో అవకాశమున్న ప్రతీ ప్రాంతంలో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సభల నేపథ్యంలో జనసమీకరణ చేసే బాధ్యతను ఆయా గ్రామాల అధ్యక్షులకు అప్పగించిన ఆయన వారికి బోజనం, ఇత్యాదులను కూడా అందజేయాలని గ్రామ పార్టీ కమిటీలను కొరాడు. అందుకు సమ్మతించిన కమీలు తమ ఎత్తుల ముందు అమాయక కార్యకర్తలు ఏలా నిలుస్తారని భావించి మోసం చేస్తున్నాయి.

అదెలా అంటే సభలకు జనాన్ని సమీకరించే క్రమంలో భాగంగా సభకు హాజరైతే ప్రతీ కార్యకర్తకు రూ. 300 ఇస్తామని నమ్మబలుకుతున్నారు. ఇక తీరా సభ ముగిసిపోయిన తరువాత వారిని తమ తమ గ్రామాల వద్దకు చేరుకున్న కార్యకర్తలకు చేతిలో రూ.100 పెట్టేసి జారుకున్నారు. దీంతో తమకు సంబంధం లేదని పార్టీ నేతలు చేతులు దులుపుకున్నారు. ఈ వైనంతో బిత్తరపోయిన కార్యకర్తలు తమకు చెప్పిన విధంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్టీ గ్రామస్థాయి అధ్యక్షులపై ఎదురుతిరిగారు. అదెలానో మీరే చూడండీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS activists  protest  sunke ravi shanker  Bodiga Shobha  Choppadandi  telangana  politics  

Other Articles