రెండో తరగతి విద్యార్థి చేత హోమ్ వర్క్ చేయించడానికి హోమ్ ట్యూటర్ ఏం చేశాడో తెలుసా.? అత్యంత దారుణంగా విద్యార్థిని చావచితక బాదాడు. తన చెప్పులతో కోట్టాడు.. తాళం చెవిని విద్యార్థి వేళ్ల మధ్య పెట్టి చిత్రహింసలకు గురిచూయడం చెంపదెబ్బలు కొట్టడం చేశాడు. అంతేకాదు విద్యార్థి జుట్టు పట్టుకుని లాగడం, చెవిని నులిమేయడం, గోళ్లతో ఆ బాలుని ముఖాన్ని రక్కేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. ఇలా సంపన్నుల బిడ్డలకు వారి ఇళ్లలోకే వెళ్లి ట్యూషన్ పాఠాలను చెప్పే ఓ ట్యూషన్ టీచర్ (హోమ్ ట్యూటర్) చేయడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ట్యూటర్ చేతితో దారుణ దాడికి గురైన చిన్నారి గత వారం రోజులుగా భయకంపితుడు కావడాన్ని గమనించిన తల్లిదండ్రులు.. తమ పిల్లాడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడని అనుమానం కలిగింది. ట్యూషన్ చెప్పే గదిలోని సిసిటీవీ ఫూటేజీని పరిశీలిస్తే కానీ అసలు విషయం వారికి తెలియరాలేదు. దీంతో బాధిత బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేసి కేను నమోదు చేయించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నౌరంగాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే నౌరంగాబాద్‌కు చెందిన అమిత్ కుమార్ శర్మ కుమారుడు అనుజ్‌కుమార్ ఒక టీచర్ దగ్గరకు ట్యూషన్ కోసం వెళుతుంటాడు. ఈ నేపధ్యంలో ఆ టీచర్ బాలునిపై దాడి చేశాడు. విషయం తెలుసుకున్న తండ్రి అమిత్ తన కుమారుడిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఇంతలో ఆ టీచర్ తన ఇద్దరు స్నేహితులతోపాటు అక్కడికి వచ్చి బాధిత బాలుని తండ్రితో రాజీకి ప్రయత్నించాడు. పైగా ఆ టీచర్‌కు ఒక స్థానిక నేత మద్దతుగా నిలిచారు. వారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు అడ్డుపడుతున్నారు. కాగా తన కుమారుడు మానసికంగా కుంగిపోయాడని, వైద్యుని దగ్గరకు తీసుకువెళ్లాలని ఆ తండ్రి వాపోతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jul 02 | దేశంలో రాష్టప్రతి ఎన్నికలకు తెర లేచిన సందర్భంలో ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తులకు సంబంధించినవి కావని, రెండు సిద్దాంతాల మధ్య పోరుగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కోన్నారు. దేశంలో నెలకొన్న ‘అసాధారణ... Read more
Jul 02 | భూమిపైన ఉన్న జంతుజాలంలో మనకు కనబడనవాటినే మనం గుర్తిస్తాం. కానీ మనకు తెలియని ఎన్నోరకాల జీవచరాలు భూమిపై ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? ఇక మనకు తెలిసిన వాటిలోనూ ఎన్నో అరుదైన జీవులు వున్నాయని,... Read more
Jul 02 | రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వంగలవారని తెలిపారు. న్యాయవాదిగా... Read more
Jul 02 | దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అత్యంత వేగంగా స్పందించిన పైలట్లు వెనువెంటనే తీసుకున్న చర్యలతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులతో పాటు క్యాబిన్... Read more
Jul 02 | దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల బలపర్చిన అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్... Read more