Chidambaram dares PM Modi to speak over Rafale deal ప్రధాని సవాలుకు బదులిచ్చిన చిదంబరం..

Chidambaram responds to modi lists non gandhi congress presidents

Congress, Congress President, Dynasty politics, Indira Gandhi, Narendra Modi, Nehru-Gandhi family, non gandhi congress president, P. Chidambaram, Rahul Gandhi, Sonia Gandhi, politics

A day after PM Modi challenged the Congress to appoint a non-Gandhi as party president for five years, former Finance Minister P. Chidambaram listed out the names of Congress presidents from outside the Gandhi family.

ప్రధాని సవాలుకు బదులిచ్చిన చిదంబరం..

Posted: 11/17/2018 02:57 PM IST
Chidambaram responds to modi lists non gandhi congress presidents

ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే గాంధీ కుటుంబం బయటి వ్యక్తికి ఐదేళ్ల పాటు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టగలదా.. అని ప్రధాని నరేంద్ర మోదీ అడిగిన ప్రశ్నపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం స్పందించారు. నిన్న మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడుతూ పై విధంగా ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన చిదంబరం గాంధీ కుటుంబంలోని వారు కాకుండా కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షులుగా పనిచేసిన వారి జాబితాను ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఇక మోదీ ఆయన హయాంలోని రఫేల్‌ ఒప్పందం, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యల పై మాట్లాడాలని కోరారు.

1947 నుంచి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా చాలా మంది బయటి వ్యక్తులు పనిచేశారని చిదంబరం పేర్కొన్నారు. ఆచార్య కృపలానీ, పట్టాభి సీతారామయ్య, పురుషోత్తందాస్‌ టాండన్‌, యూఎన్‌ ధేబర్‌‌, నీలం సంజీవ రెడ్డి, కామరాజ్‌, నిజలింగప్ప, జగజ్జీవన్‌ రామ్, శంకర్‌ దయాళ్‌ శర్మ, దేవకాంత బరూవా, బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావు, సీతారాం కేసరిల పేర్లను ఆయన ట్వీట్‌ చేశారు. ‌అంతేకాకుండా స్వాతంత్ర్యానికి ముందు నుంచి ఎంతో మంది గొప్ప నేతలు కాంగ్రెస్‌లో ఉన్నారని, అందుకు తాము గర్వపడుతున్నామని పేర్కొన్నారు. బాబాసాహెబ్‌‌ అంబేడ్కర్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, కె. కామరాజ్‌, మన్మోహన్‌ సింగ్‌ ఇలా ఎంతో మంది నేతలు దేశం కోసం కృషి చేశారని తెలిపారు.

ప్రధాని మోదీ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారనే విషయంపై అంత సమయం వెచ్చించి మాట్లాడం తమకు గొప్పగా ఉందని చిదంబరం పేర్కొన్నారు. అందులో సగం సమయం పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రఫేల్‌, సీబీఐ, ఆర్‌బీఐల గురించి మాట్లాడడానికి కేటాయిస్తారా అని ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగిత, మూకదాడులు, అత్యాచారాలు, ఉగ్రదాడులు తదితర అంశాలపై మోదీ మాట్లాడుతారా అని చిదంబరం సవాలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  p chidambaram  non gandhi congress president  Congress  politics  

Other Articles