you may lose LPG subsidy from Dec 1 ‘‘మీకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సీడి ఇక రాదు..’’

Customers may lose lpg connection from december 1

State Bank of India, sbi, aadhaar account linking, aadhaar lpg linking, lpg kyc, oil companies, PM Modi, union goverenment

As many as 1 crore LPG consumers may not get gas cylinders from 1st December, 2018 as they haven't yet done their KYC. Union government has asked Govt gas agencies to complete the KYC of all consumers by 30 November.

డిసెంబర్ 1 నుంచి.. మీకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సీడి రాదు

Posted: 11/16/2018 01:44 PM IST
Customers may lose lpg connection from december 1

మీరు ఎల్జీజీ సబ్సీడీ గ్యాస్‌ సిలిండర్ వినియోగదారులా.? అయితే ఈ విషయం తెలియకపోతే మీకు ప్రభుత్వం అందించే సబ్సీడి రాయితీ ధర అందదు. మేము సంపన్నులమో లేక సబ్సీడి రాయితీని వద్దనుకున్న వాళ్లమో కాదు.. మాకెందుకు సబ్సీడి వర్తిందరు అని అనుకుంటున్నారా.? మీరు ఎవరన్న విషయాలు ప్రభుత్వానికి తెలియకపోతే ఎలా రాయితీని అందిస్తుంది. ఇక మరో మాటలో చెప్పాలంటే.. ఆధార్ కార్డును ప్రభుత్వ పథకాలతో లింక్ చేయడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించిన క్రమంలో ఇప్పుడు మీ అధార్ కార్డును గ్యాస్ కనెక్షన్ తో అనుసంధానం చేయడం తప్పనిసరిగా మారింది.

ఇప్పటి వరకు మీ కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌) వివరాలు తెలియకపర్చనప్పటికీ ప్రభుత్వం మీకు గ్యాస్ సిలిండర్ పై సబ్సీడిని అందించింది. కానీ ఇకపై మాత్రం అలా కుదరదు. ఎందుకంటే ప్రభుత్వం ఇందుకు డెడ్ లైన్ విధించింది. వీలైనంత త్వరగా గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లకు మీ వివరాలను తెలియజేసే ఆధార్ కార్డును కచ్చితంగా అందించాలి. మీ కస్సూమర్ నెంబరుతో మీ ఆధార్ కార్డును అసుసంధానించి.. మీ బ్యాంకు అకౌంట్ నెంబరు కూడా పోందుపర్చాల్సిందే, లేకుంటే గ్యాస్‌ సబ్సిడీకి కోత పడే ప్రమాదముంది.

జనవరి 2019 నుంచి ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని గ్యాస్‌ డీలర్లు చెబుతున్నారు. కేంద్ర చమురు సంస్థలు ఈ మేరకు డీలర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చాయి. రాష్ట్రంలో కోటి కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి రోజూ లక్ష దాకా సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ అవుతున్నాయి. సబ్సిడీ దుర్వినియోగం కాకుండా, కనెక్షన్ల డూప్లికేషన్‌కు అవకాశం లేకుండా చూసేందుకు గ్యాస్‌ వినియోగదారులు కేవైసీ వివరాలను సంబంధిత డీలర్‌కు విధిగా అందజేయాలి. అయితే ఈ విషయం చాలా మంది వినియోగదారులకు తెలియదు.

ఆ వివరాలు తీసుకోవాలన్న ఆలోచన కొందరు డిస్ర్టిబ్యూటర్లకే ఉండదన్న వాదనా ఉంది. గ్యాస్‌ వినియోగదారుల నుంచి ఈ వివరాలు తీసుకోకుంటే అందుకు బాధ్యత డీలర్లదేనని చమురు కంపెనీలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా కేవైసీ వివరాలు సమర్పించాలంటూ డిస్ట్రిబ్యూటర్లపై చమురు కంపెనీలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇంత తక్కువ వ్యవధిలో కోటి మంది గ్యాస్‌ కనెక్షన్‌దారుల కేవైసీ వివరాలు సేకరించడం సాధ్యం కాదని డిస్ర్టిబ్యూటర్లు చెబుతున్నారు. తొలుత ప్రచారం ద్వారా ఈ అంశంపై వినియోగదారులను చైతన్యపరిచాలని, ఆ తరువాత వివరాలు సేకరిస్తే లక్ష్యసాధన సులువు కాగలదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles