sadhana singh humiliated whilecampainging ప్రచారంలో పరాభవం.. సీఎం సతీమణికి కూడా తప్పలేదు..

Shivraj singh chauhan s wife faces public ire while campainging

Madhya Pradesh assembly polls, madhya pradesh election 2018, Sadhna Singh, Chief Minister Shivraj Singh Chauhan, sadhana singh humiliation, voters demands of poll promises, voters ask sadhana singh of poll promises, Sehore, angry women voters humiliate sadhana singh,

Madhya Pradesh assembly election 2018: Sadhna Singh wife of Chief Minister Shivraj Singh Chauhan feels humiliation from voters in Sehore, While angry women voters demanding to fulfill the promises given in last elections.

ITEMVIDEOS: ప్రచారంలో పరాభవం.. సీఎం సతీమణికి కూడా తప్పలేదు..

Posted: 11/13/2018 12:48 PM IST
Shivraj singh chauhan s wife faces public ire while campainging

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్, చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో అధికారంలో వున్న పార్టీల అభ్యర్థులకు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఓటర్లలో కూడా రాజకీయ చైతన్యం వచ్చినట్లు అర్థమవుతుంది. కేవలం ఎన్నికల ప్రచార సమయంలోనే పార్టీల అభ్యర్థులు తమ ఇళ్ల ముంగిళ్లలోకి వస్తారని, అప్పుడే వారిని నిలదీసి.. అన్ని అడిగేయాలని కూడా నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా గతంలో గెలుపొందిన అభ్యర్థులు ఇచ్చి నెరవేర్చని హామీలు ఏమయ్యాని నిలదీస్తున్నారు. ఇంతకన్నా మంచి సమయం తమకు మరెప్పుడు రాదని అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలనీలకు, గ్రామాలకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్న అధికార పార్టీల అభ్యర్థులపై ఓటర్లు మండిపడుతున్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. అయితే ఇలాంటి పరాభవాలు నేతలు మామూలే అన్నవారూ లేకపోలేరు.

అయితే రాష్ట్రస్థాయి నేతలో.. లేక ముఖ్యమంత్రి హోదాలో వున్న నేతలు తమ తమ స్థానల్లో గెలుపొందేందుకు ప్రచారం ఏదో ఒకటో రెండు రోజులు మాత్రమే కేటాయిస్తారు. మిగతా అంతా వారి కుటుంబసభ్యులే చూసుకుంటారు. ఇదే తరహాలో సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్ సతీమణి తన భర్త నియోజకవర్గంలోని పనులను చక్కబెడుతుంటారు. అయితే గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అమెను కూడా అక్కడి ఓటర్లు ప్రశ్నించారు. దీంతో తెల్లముఖం వేసిన ఆమె అక్కడ పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. శివరాజ్ సింగ్ చౌహాన్ సతీమణి సాధనా సింగ్ తన భర్తకు ఓటువేయమని కోరుతున్న వేళ, ఓ మహిళ నిలదీయడంతో కంగుతిన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివరాజ్‌ సింగ్ మరోమారు బుద్నీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండగా, భర్త విజయం కోసం సాధన ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఒక మహిళా ఓటరు ఆమెను వాయించేసింది. తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని గుర్తు చేసింది.

ఓట్ల సమయంలో వచ్చి, అన్ని సమస్యలూ నెరవేరుస్తారని హామీలు ఇస్తారని, తమకు చుక్క తాగునీరు అందడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తామంతా దాహంతో చచ్చిపోతున్నామని మండిపడింది. అక్కడే ఉన్న ఇతరులంతా ఆ మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, ఆమె మాత్రం తగ్గలేదు. ఆ మహిళ వాదనకు సాధన సింగ్ షాక్ తగిలింది. నీటి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి, ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో బీజేపి కార్యకర్తలు శాంతి శాంతి అనగా.. ఏం శాంతి.. ఐదేళ్లుగా అదే చేస్తున్నామని బదులివ్వడంతో.. వారు కూడా కిమ్మనకుండా జారుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sadhna Singh  Shivraj Singh Chauhan  poll promises  voters  madhya pradesh  

Other Articles