excise police shocks pivots on those 4 days ఆ 4రోజులు.. మందుబాబులకు ఎకైజ్ అధికారుల షాక్..

Excise police shocks pivots ban on sale of liquor on those 4 days

Telangana excise police, pivots, election commission, excise officials, ban the sale of liquor, telanagana assembly election, polling day, votes counting day, telangana, politics

Telangana excise police shocks pivots, according to the orders passed by election commission, excise officials ban the sale of liquor on polling day and counting day.

మందుబాబులకు ఎకైజ్ అధికారుల షాక్.. ఆ నాలుగు రోజులూ అంతే..

Posted: 11/10/2018 02:57 PM IST
Excise police shocks pivots ban on sale of liquor on those 4 days

మందుబాబులకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. దేశంలోనే అత్యధిక అదాయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తున్న మద్యం బాబులు  ఆ నాలుగు రోజులు మాత్రం ప్రభుత్వానికి అదాయాన్ని సమకూర్చడం లేదు. ఎందుకంటే నాలుగు రోజుల పాటు తెలంగాణలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. తెలంగాణ శాసనసభకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఈ అంక్షలు అమల్లోకి రానున్నారు.

డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించున్న క్రమంలో రెండు రోజుల పాటు ఆ తరువాత 11న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు మొత్తంగా నాలుగు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల నుంచి ప్రత్యేక అదేశాలు వెలువడిన క్రమంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

డిసెంబర్ 7న ఎన్నికలు జరగనుండగా... 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూత పడనున్నాయి. అదే విధంగా 11వ తేదీన కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. 10వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి 12వ తేది ఉదయం 10 గంటల వరకు లిక్కర్ అమ్మకాలు జరగవు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.     

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles