Etala rajender's car driver to contest against him ఈటెలకు ఎన్నికల బరిలో మల్లేశ్ యాదవ్ సవాల్

Etala rajender s car driver in election contest against him

Etala Rajender, mekala mallesh yadav, independent, car driver, Jail, donations, RS 30 lakh, assembly elections, telangana, politics

The Telangana former minister Etala Rajender faces assembly election fight not only from prajakutami candidate but also with his former car driver, mekala mallesh yadav.

ఈటెలకు ఎన్నికల బరిలో మల్లేశ్ యాదవ్ సవాల్

Posted: 11/10/2018 01:35 PM IST
Etala rajender s car driver in election contest against him

టీఆర్ఎస్ నేత, రాష్ట్ర అర్థిక మంత్రి ఈటల రాజేందర్ పై పోటీకి దిగుతున్నాడు ఆయన మాజీ డ్రైవర్ మేకల మల్లేశ్ యాదవ్. ఈటెల మంత్రి కాకముందు నుంచి.. ఉద్యమం కొనసాగుతున్న కాలం నుంచి ఆయన వద్ద కారు డ్రైవర్ గా విధులు నిర్వహించి మాజీ డ్రైవర్ పోటీకి దిగడం అసక్తికరంగా మారింది. అయితే తాను రాజేందర్ పై గెలుపు సాధిస్తానని నమ్మకం తనకు లేదని.. అయితే తనకు నమోదైన ఓట్ల తేడాతో రాజేందర్ ఓటమి సాధిస్తే చాలునని మల్లేశ్ యాదవ్ తెలిపారు.

తన మాజీ బాస్ పైనే ఇంతలా ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అయిన మల్లేశ్ యాదవ్.. తనకు ఏ పార్టీ టిక్కెట్ కేటాయించకపోయినా తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడించారు. అయితే మల్లేశ్ యాదవ్ కు రాజేందర్ పై ఎందుకంత అక్కస్సు అంటే.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా తాను 45 రోజులు జైలులోనే ఉన్నానని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదల అయ్యాక తన కష్టాలను చూసిన కొందరు దాతలు.. రూ.30 లక్షలు సాయంగా అందించారని చెప్పారు.

అయితే ఈ మొత్తాన్ని ఈటల రాజేందర్ లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద పనిచేస్తే తనకు వచ్చిన డబ్బును కూడా లాక్కునే నైజంమున్న నేత ప్రజలకు ఎదో మేలు చేస్తాడని భ్రమిస్తే అది తప్పని తేల్చిచెప్పాడు. జైలుకు వెళ్లడంతో తన ఉద్యోగం ఊడిందనీ, ఇప్పుడు కూలి పని చేసుకుంటూ జీవితం గడుపుతున్నానని బాధపడ్డారు. ఇంత జరిగినా ఈటెల రాజేందర్ డబ్బు ఇవ్వడం గానీ, ఆదుకోవడం గానీ చేయలేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున తనకు ప్రాణహాని ఉందనీ, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles