RSS Leader Breaks Sabarimala Tradition శబరిమల ఆలయంలో అపచారం.. ఆచారాలకు బ్రేక్..

Rss man leading protests at sabarimala allegedly breaks tradition

RSS man breaks tradition Sabarimala, Sabarimala golden steps, sabarimala protest, Sabarimala, Protesters, RSS, Valsan Thillankeri, head priest, Travancore Devswom Board, devotees, golden steps, Idumudi Kettu, tradition

A top RSS leader of the state, Valsan Thillankeri, representing the protesting devotees at Sabarimala, was seen standing on the holy 18 steps without the Idumudi Kettu violated the key traditions of the Ayyappa temple.

శబరిమల ఆలయంలో అపచారం.. ఆర్ఎస్ఎస్ నేతపై భక్తుల అగ్రహం..

Posted: 11/06/2018 06:57 PM IST
Rss man leading protests at sabarimala allegedly breaks tradition

శబరిమల ఆలయంలోకి నిషేధిత వయస్సు మహిళల ప్రవేశించడాన్ని అడ్డుకునేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతృత్వంలో ఉద్యమిస్తున్న నాయకుడే ఆలయంలో అపచారానికి పాల్పడ్డాడు. అతనే కాదు అతనితో పాటు అతని వెంటనున్న అనుచరులు కూడా ఇదే అపచారం చేశారు. నిషిద్ద వయస్సు మహిళలు ఆలయంలోనికి ప్రవేశించడంతో ఆలయ ఆచారాలకు విఘాతం కలుగుతుందని అందోళన చేస్తున్న రాష్ట్రస్థాయి ఆరెస్సెస్ నేత.. ఆలయ ఆచారాలను బ్రేక్ చేశారు.

అయ్యప్ప భక్తులు అత్యంత పవిత్రంగా భావించే పద్దెనిమిది బంగారు మెట్లపైకి ఆయన తన అనుచరులతో కలసి వెళ్లారు. బంగారు మెట్లు ఎక్కిన ఆయన మధ్యలో నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి మండల దీక్ష చేపట్టిన తరువాత ఇరుముడి ధరించిన భక్తులు మాత్రమే ఈ పరమ పవిత్రమైన బంగారుమెట్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. అంతేకాదు బంగారు మెట్లను ఎక్కడమే కాకుండా ఆయన మెట్లను దిగడం కూడా ఆలయ ఆచారన్ని విఘాతపర్చడమే. ఆలయ ఆచారాలకు విఘాతం కలిగించిన భక్తులు అర్ఎస్ఎస్ నేత వల్సాన్ తిల్లంకేరిపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వల్సాన్ తిల్లంకేరి బంగారు మెట్లపైకి ఎక్కడం.. కిందకు దిగడం వార్తను విన్న ఆయప్పస్వామి ఆలయ ప్రధానార్చకులు ఆయన చర్యపై తీవ్రంగా మండిపడ్డారు. ఆలయ ఆచారాలను కాపాడుతామని చెప్పుకుని వచ్చిన నేతలే ఆలయంలో అపచారాలకు తావివ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు విచారణకు అదేశించింది. ఈ విషయమై స్పందించిన ఆలయ బోర్డు సభ్యుడు శంకర్ దాస్.. నిషిద్ద వయస్సు మహిళలు ఆలయంలోకి ప్రవేశించకుండా అందోళన చేస్తున్న వారే ఇలాంటి అపచారాలకు పాల్పడటంపై విస్మయం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles