Protesters target journalists at Sannidhanam సన్నిధానం వద్ద జర్నలిస్టులను అడ్డుకున్న భక్తులు

Clashes outside sabarimala temple 52 year old woman injured

sabarimala temple, Ayyappa swamy temple, VHP rally, save sabarimala rally, Pamba river, chithra aatta vishesham, sabarimala temple case, sabarimala temple issue, sabarimala temple darshan, sabarimala temple verdict, sabarimala temple news, sabarimala temple kerala, pinarayi vijayan, bharatiya janata party, congress, Supreme court, violent protests, women reporters, BJP, Kerala, politics

Protesters at sabarimala target media persons, including a cameraman of a local television channel, were attacked at sannidhanam. And there was high drama with devotees protesting against the entry of a woman pilgrim, suspecting her to be in the menstrual age.

శబరిమల ఆలయ అవరణలో దాడులు.. వృద్ద మహిళకు గాయాలు

Posted: 11/06/2018 11:59 AM IST
Clashes outside sabarimala temple 52 year old woman injured

శ్రీచిత్ర తిరునాళ్ ఉత్సవం నేపథ్యంలో పటిష్ట భద్రత నడుమ క్రితం రోజు సాయంత్రం తెరుచుకున్న శబరిమల స్వామి అయ్యప్ప ఆలయం వద్ద సోమవారం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇవాళ అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. శబరిమల సహా పంబ నుంచి పరిసరాల్లోని దాదాపు 30 కిలోమీటర్ల దూరం వరకు పోలీసులు 144 సెక్షన్ ను అమలుపర్చినా.. అందోళన కారులు మాత్రం ఆలయంలోనికి మహిళలు అడుగపెట్టరాదని, తమ ఆచార వ్యవహారాలను కాపాడాలని కోరుతూ అందోళనకు దిగారు.

గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తొలిసారిగా తెరుచుకున్న ఆలయానికి జర్నలిస్టులు, అందులోనూ మహిళా జర్నలిస్టులు రావడంతో.. వారి వాహనాలను కూడా ధ్వంసం చేసిన అందోళనకారులు వారిపై కూడా దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందోళనకారులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సారి శబరిమల ఆలయానికి జర్నలిస్టులు రాకను కూడా అందోళనకారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

అయ్యప్పస్వామికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ఇవాళ శ్రీ చిత్ర తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పంపా నదిలో పుణ్యస్నాలు చేసి, శబరిగిరికి చేరుకుని సన్నిధానంలో స్వామికి ఇరుముళ్లు సమర్పిస్తున్నారు. ఇదే సమయంలో ఈ తిరునాళ్లను కవర్ చేయడంతో పాటు ఉద్రిక్త పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఆలయానికి వచ్చిన జర్నలిస్టులపై సన్నిధానం చేరువలో నిరసనకారులు కన్నెర్ర చేశారు. పాత్రికేయులతో పాటు కెమెరామన్ పై కూడా దాడి చేశారు.

ఆ తరువాత కొంత సమయానికి నిషేధిత వయసున్న మహిళ ఆలయంలోకి ప్రవేశించారనే వార్తలతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో భక్తులు మరోసారి ఆందోళనకు దిగారు. త్రిశూర్ కు చెందిన లలిత (52) తన కుమారుడితో కలిసి మంగళవారం ఉదయం శబరిమలకు చేరుకున్నారు. ఈ సమయంలో ఘర్షణ వాతావరణం నెలకొనగా, మీడియాపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ వీడియో జర్నలిస్ట్ గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళతో పాటుగా అమెతో వచ్చిన 19 మంది భక్తుల బృందాన్ని రక్షణగా నిలిచారు.

ఇక అమెను అక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేస్తున్న సుమారు 200 మంది అందోళనకారులు శరణం అయ్యప్ప అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అమె వయస్సును నిర్థారించుకున్న తరువాత అదే విషయాన్ని అందోళనకారులకు తెలిపారు. అమె నిషేధిత వయస్సను దాటారని, తన మనవడి చోరున్ను (అన్నప్రాసన) కార్యక్రమానికి వచ్చానని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీంతో ఆందోళన విరమించిన భక్తులు, ఆమెను దర్శనానికి అనుమతించారు. ఇక శబరిమలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ 25ఏళ్ల మహిళను పంబవద్ద పోలీసులు నిలిపివేశారు. భర్త, తన ఇద్దరి పిల్లలతో కలిసి వస్తున్న ఆమెను పోలీసులు వెనక్కు పంపారు.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles