pawan kalyan fires on chandrababu మా మద్దతుతో గెలిచి కాంగ్రెస్ తో ఎలా కలుస్తారు: పవన్

Pawan kalyan slams tdp on joining hands with congress

pawan kalyan, janasena, Chandrababu, TDP. Tuni public meeting, chiranjeevi, Rajya sabha member, congress, Pawan Kalyan train Yatra, pawan kalyan praja porata yatra, pawan kalyan interacts, pawan kalyan tuni yatra, pawan kalyan vijayawada to tuni yatra, Pawan Kalyan public meeting, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan Question ruling TDP partym how can one join the party which had bifurcated the united andhra pradesh

ITEMVIDEOS: రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ తో ఎలా జతకలుస్తారు: పవన్

Posted: 11/02/2018 09:57 PM IST
Pawan kalyan slams tdp on joining hands with congress

ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీసి.. అస్తిపాస్తులు వాళ్లకిచ్చి.. అప్పుసోప్పులు మనకిచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్.. ఆ పార్టీతో ఇప్పుడు చంద్రబాబు జతకట్టడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. అదే పార్టీలో తన సొంత అన్న వున్నా ఆయనను పక్కన పెట్టి టీడీపీకి మద్దతిస్తే.. చంద్రబాబు చెల్లించే మూల్యం ఇదా అంటూ ప్రశ్నించారు. తిట్టి పోసిన రాహుల్ గాంధీతో మళ్లీ ఫోటోలు తీయుచుకుంటున్న బాబుకు సిగ్గు లేదా అంటూ ప్రశ్నించారు.

ఢిల్లీలో తెలుగవారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. తునిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. చంద్రబాబు టార్గెట్‌గా మరోసారి నిప్పులు చెరిగారు. ‘రాష్ట్ర శ్రేయస్సు కోసం 2014లో జనసేన పోటీకి దూరంగా ఉంది. అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు సీఎం అయితే.. రాష్ట్రానికి దిశా నిర్దేశం చేస్తారని మద్దతు ఇచ్చా. కాంగ్రెస్ హఠావో.. దేశ్ కి బచావో నినాదాన్ని వినిపించాను. రక్తం పంచుకుపుట్టిన సొంత అన్నను కాదన్నా.. ఆయనపై ప్రేమ, ఇష్టం ఉన్నా బాధపెట్టా. నా తల్లిని, అన్నదమ్ముల్ని కాదనుకొని వచ్చి మీకు మద్దతిస్తే.. మళ్లీ వెళ్లి ఆ పార్టీతోనే కలుస్తారా. రాహుల్ గాంధీతో ఫోటోలు దిగుతారా ’అంటూ ప్రశ్నించారు.

‘విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా.. టీడీపీ ఎంపీలను చావగొడితే చంద్రబాబుకు పౌరుషం వచ్చిందో లేదో తెలియదు. నాకు మాత్రం కడుపు మండింది.. ఆంధ్రా కొడుకులు, దోపిడీ కొడుకులు అంటూ కొందరు తిట్టారు. నేతల్ని తిడితే తిట్టుకోండి.. ప్రజలు ఏం పాపం చేశారు. అప్పుడు అండగా ఉండాల్సిన యూపీఏ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది. సొంత అన్న కాంగ్రెస్‌లో ఉన్నా టీడీపీకే మద్దతు పలికా కదా. అలా రాష్ట్రాన్ని అన్యాయం చేసిన వారితో మీరు కలుస్తారా.. సిగ్గు లేదా’అంటూ నిలదీశారు.

‘పవన్ కళ్యాణ్ బీజేపీని వెనకేసు కొస్తున్నాడంటున్నారు. బీజేపీనే వెనకేసుకొస్తున్నానా.. అన్ననే కాదన్నొడిని.. మోదీ, అమిత్ షా ఎంత. కాని చంద్రబాబు చేసిన పనులతో బాధ కలిగింది. గతంలో బీజేపీని తిడితే.. వాళ్లను వెనకేసుకొస్తారు. ఇప్పుడు కాంగ్రెస్‌ను తిడితే వాళ్లను వెనకేసుకొస్తారని మండిపడ్డారు. ఈ మధ్య జీన్స్, టీ షర్ట్‌లు తీసేసి పంచెలు కట్టుకుంటున్నా. దీనికి ఓ కారణం ఉంది. పంచె తెలుగువారి ఆత్మగౌరవానికి గుర్తు. ఆ గౌరవాన్ని గుండెల్లో పెట్టుకునేందుకే పంచె కట్టుకుంటున్నానన్నారు’ పవన్.

‘రాజకీయాల్లో అవకాశ వాదం పెరిగిపోయింది.. పార్టీ పెట్టడానికి కారణమే కాంగ్రెస్ అవమానం చేసిందని.. ఎన్టీఆర్ కూడా అందుకే పార్టీ పెట్టారు. అలాంటి పార్టీతో మీరు ఎలా కలుస్తారు. పొత్తులు ఎలా పెట్టుకుంటారు. రేపు జగన్, చంద్రబాబు కలిసినా ఆశ్చర్యం లేదు.. బాబు అనుకుంటే కలుస్తారు కూడా.. తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు మద్దతు కావాలంటే.. జనసేన ఆఫీస్‌, మా ఇంటికి రండి అండగా ఉంటా’అన్నారు.

ఈ సందర్భంగా పవన్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ‘గతంలో ఓసారి మోదీగారిని కలిసినప్పుడు జనసేన పార్టీ గురించి మాట్లాడారు. పార్టీని నడపటం అంటే సులభం కాదన్నారు. అందులో ప్రాంతీయ పార్టీ అంటే.. కోట్లాది రూపాయల కావాలన్నారు. జనసేన ఎందుకు బీజేపీలో కలిపేయమన్నారు. నేను మాత్రం మెడ కోసుకుంటానేమో కాని.. పార్టీని, ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టనన్నారు’ పవన్.

‘పవన్ కళ్యాణ్‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. తప్పులు చేసినప్పుడు విమర్శించకూడదా.. మీరు అన్యాయం చేస్తే ప్రశ్నించకూడదా. 2014లో పవన్ మీ కోసం తిరిగిన సంగతి మర్చిపోయారు. మరి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా.. సర్పంచ్‌గా పోటీ చేయకుండా.. మీ అబ్బాయి పంచాయతీ రాజ్ శాఖ్ మంత్రి అయ్యారు. ఈ తుని నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన యనమల గారు దొడ్డి దారిన మంత్రి అయ్యారు.

ఇక యనమల వియ్యంకులకు కాంట్రాక్టులు వస్తున్నాయి. ఇవి ఎలా వస్తున్నాయని అడిగే హక్కు ప్రజలకు ఉంది. అయితే యనమల అనుభవాన్ని తక్కువ చేయడం కాదు. అంత పెద్ద చదువులు చదువుకోలేదు. ఓ సాధారణ పోస్ట్‌మాన్ మనవడ్ని.. కానిస్టేబుల్ కొడుకును.. తప్పు జరిగితే ప్రశ్నించే తత్వం ఉంది. అందుకే యువతకు ఉద్యోగాలేవని అడుగుతున్నా.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో యనమల పూర్తిగా విఫలమయ్యారు. కేవలం చంద్రబాబు గారి అబ్బాయికి ఉద్యోగం వస్తే రాష్ట్ర యువతకు వచ్చినట్లా.? అని ప్రశ్నించారు

‘గతంలో ప్రత్యేక హోదా గురించి అడిగితే యువతను అరెస్ట్ చేశారు.. తల్లిదండ్రుల్ని కూడా బెదిరించారు. ఇప్పుడేమో ధర్మపోరాట దీక్షల పేరుతో సభలు పెడుతుంటే ఏమనాలి. హోదా కోసం ప్రధానిని కలవొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కేంద్రంతో విభేదించాల్సి వస్తే.. ఓ క్రమం ఉంటుంది. ప్రధానిని కలిసి పద్దతిగా అడుగుతాం.. గొడవ చేస్తాం.. చివరిగా రోడ్డుపైకి వస్తాం. మీరు ఇస్తారా ఇవ్వారా.. ఇవ్వకుంటే చెప్పండి.. మేం తేల్చుకుంటాం ’అంటూ ఆవేశంగా ప్రసంగించారు పవన్.

‘జనసేన ఎవరీతో పొత్తు పెట్టుకోలేదు. రాష్ట్రంలో అన్నదమ్ములు, అక్క చెల్లళ్లతో పొత్తు పెట్టుకుంది. ఎంత కష్టమొచ్చినా.. ఒంటరిగానే నిలబడతా. 2వేల పాకెట్ మనీనా.. 25 ఏళ్ల భవిష్యత్ కావాలా తేల్చుకోండి. ఒకవేళ ఎవరన్నా డబ్బు ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం జనసేనకు వెయ్యండి. ఎక్కడికెళ్లినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. ఓ సరికొత్త రాజకీయ వ్యవస్థ రావాలి. 25 ఏళ్ల భవిష్యత్ కోసం జనసేన ఉంది.. హామీలు కాదు.. సమస్యలు పరిష్కరిచేందకు పనిచేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Chandrababu  TDP. chiranjeevi  congress  Tuni  andhra pradesh  politics  

Other Articles