poison not applied to knife says doctors జగన్ సేఫ్.. దాడి చేసిన కత్తికి విషం లేదన్న వైద్యులు

No poison applied to knife attacked on ys jagan

YS Jagan, YS Jagan attacked, YS Jagan vizag airport attack, YS Jagan Mohan Reddy, YS Jagan, Citi Neuro Centre Hospital, Lotus pond, ysrcp, no poison to knife, healing of wound, YS Jagan srinivas rao, YS Jagan vishakapatnam airport attack, YSRCP, Vishakapatnam airport, YS Jagan injured, andhra pradesh, politics

Citi Neuro Centre Hospital Doctors team on Tuesday visited the residence of YS Jagan Mohan Reddy at Lotus pond and reviewed the health condition of him.

జగన్ సేఫ్.. దాడి చేసిన కత్తికి విషం లేదన్న వైద్యులు

Posted: 10/30/2018 03:10 PM IST
No poison applied to knife attacked on ys jagan

విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో ఆ కత్తికి విషం ఏమైనా పూసి వుందా.? అన్న కోణంలో ఆ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాదు లోని సిటీ న్యూరో అసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న జగన్.. అక్కడే పలు పరీక్షలకు కూడా హజరయ్యారు. ఈ క్రమంలో వైసీపీ నేతల అనుమానాలపై దృష్టిసారించిన వైద్యులు ఆయనకు రక్త నమూనాలను సేకరించి.. ఆయన శరీరంలోకి ఏమైన విషపదార్థాలు వెళ్లాయా అన్న కోణంలోనూ పరీక్షలు నిర్వహించారు. ఆయన కోలుకున్న తరువాత మరుసటి రోజు ఇంటికి పంపించారు.

అయితే ఆయన అరోగ్యం పరిస్థితిని ఇవాళ సిటీ న్యూరో అసుపత్రి వైద్యులు పరీక్షించారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో గల తన నివాసం లోటస్ పాండ్ లో జగన్ విశ్రాంతి తీసుకుంటున్నా క్రమంలో ఇవాళ సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రికి చెందిన నలుగురు వైద్యులు వచ్చి ఆయన అరోగ్యాన్ని పరీక్షించారు. ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. గాయాన్ని పరిశీలించారు. శనివారం నుంచి పాదయాత్రను మళ్లీ ప్రారంభించాలని జగన్ భావిస్తున్న క్రమంలో వైద్యులు ఆయన అరోగ్యాన్ని పరీక్షించారు. ఈ నేపథ్యంలో, ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు పరీక్షించారు. జగన్ ను పరీక్షించిన వారిలో ఆయనకు సర్జరీ చేసిన డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ సాంబశివారెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ మధులు ఉన్నారు.

కాగా పరీక్షల అనంతరం వైద్యులు మీడియాతో మాట్లాడుతూ జగన్ అరోగ్యం స్థిరంగా వుందని తెలిపారు. జగన్ ను పొడిచిన కత్తికి ఎలాంటి విషం లేదని వెల్లడించారు. ప్రస్తుతం గాయం నుంచి ప్రతిపక్ష నేత కోలుకుంటున్నారని చెప్పారు. అయితే చేతిని కదిలించేటప్పుడు జగన్ నొప్పితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. నొప్పి ఇంకా తగ్గకపోవడంతో జగన్ కు యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నట్లు డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు.

త్వరలోనే మళ్లీ ఆయన ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొననున్న నేపథ్యంలో చేతికి ఎక్కువ శ్రమ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు.చర్మంపై వేసిన కుట్లు సాధారణంగా వారంలోనే మానిపోతాయనీ, అయితే కండరాలకు వేసిన కుట్లు మానడానికి మరికొంత సమయం పడుతున్నారు. జగన్ విషయంలో గాయం పూర్తిగా మానడానికి మరో 45 రోజులు పట్టే అవకాశముందని స్పష్టం చేశారు. పాదయాత్రకు వెళతానన్న కోణంలోనే జగన్ మాట్లాడారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  YS Jagan Mohan Reddy  YS Jagan  Citi Neuro Centre Hospital  Lotus pond  poison  knife  

Other Articles