srinivas rao called up KK 500 times, who is he? కేకేతో శ్రీనివాసరావు 500 ఫోన్ కాల్స్.? ఎవరాయన.?

Twist in jagan attack case accused called kk 500 times who is he

YS Jagan, YS Jagan attack case, Srinivas rao, special investigative team police, KK, Office assistant, fusion food restaurent, Harsha, YS Jagan vizag airport attack, YS Jagan Mohan Reddy, YS Jagan, roja, GVL narsimha rao, chinarajappa, nara lokesh, YS Jagan srinivas rao, YS Jagan vishakapatnam airport attack, YSRCP, Vishakapatnam airport, YS Jagan injured, andhra pradesh, politics

Srinivas the main accused in YSRCP president YS Jagan attack case, had called up a person KK nearly 500 times since six months. AP Police SIT Team investigation brings a new twist in the attack case saying he is a office assistant in YSRCP office.

కేకేతో శ్రీనివాసరావు 500 ఫోన్ కాల్స్.? ఎవరాయన.?

Posted: 10/30/2018 01:10 PM IST
Twist in jagan attack case accused called kk 500 times who is he

విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావును గత రెండు రోజులుగా విచారించిన పోలీసుల ప్రత్యేక బృందం అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టడంలో విఫలమైందని బావిస్తున్న తరుణంలో.. ఈ కేసులో అసక్తికర ములుపు తిరిగింది. తాను వైఎస్సార్ సిపీ పార్టీకి అభిమానినని, జగన్ అంటే ప్రాణమని నిందితుడు వ్యక్తపర్చడంతో పాటు.. అతని తల్లిదండ్రులు, సోదరుడు కూడా అదే విషయాన్ని పోలీసుల దర్యాప్తులోనూ వ్యక్తపర్చారు.

వైసీపీకి అభిమానిగా వున్న వ్యక్తి.. పార్టీ అధినేతపై విమానాశ్రయంలో ఎందుకు దాడి చేశాడన్న ప్రశ్నలు తలెత్తి.. పోలీసులు అన్ని కోణాల్లో నిందితుడ్ని విచారించారు. అయితే ఈ కేసులో క్షుణ్ణంగా ప్రతీ అంశాన్ని పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. అతని బ్యాంకు లావాదేవీలు, కాల్ డేటాను పరిశీలించిన పిమ్మట కూడా కీలక అధారాలు లభ్యం కాలేదని తలపట్టుకున్నారు. అయితే ఆయన కాల్ డేటాను పరిశీలించి.. అనుమానాస్పందంగా వున్న కోణంలో విచారించిన పోలీసులకు కేసును మలుపు తిప్పే సమాచారం లభ్యమైందని తెలుస్తుంది.

శ్రీనివాస రావు కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు ఆయన గడచిన 9 నెలల వ్యవధిలో 10 వేల కాల్స్ చేశాడన్న సంగతి తెలిసిందే. అయితే అందులో అనేక మందికి వందల సార్లు ఫోన్ చేశాడు శ్రీనివాస రావు. దీంతో పలుమార్లు రిపీట్ అయిన నెంబర్లపై కాకుండా కొన్ని సార్లు మాత్రమే చేసిన నెంబర్లపై పోలీసులు దృష్టిసారించారు. కాగా, ఇందులో సుమారు 500 కాల్స్ కు పైగా ఓ నెంబరుకు ఫోన్ చేయడంతో పోలీసులు కాసింత అనుమానంగా దీనిపై శ్రీనివాస రావును విచారించారు.

దీంతో ఆ నెంబరు కేకే అనే వ్యక్తిదని గ్రహించని పోలీసులు ఇంతకీ ఎవరు అతను అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అయితే అతను వైఎస్ఆర్ సీపీ ఆఫీస్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు.. ఇక అలస్యం చేయకుండా కేకే అనే వ్యక్తి వెంటనే అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అతడ్ని ఈ ఉదయం నుంచి ప్రశ్నిస్తున్నారు. గుంటూరులో ఉన్న కేకేను ప్రశ్నించేందుకు విశాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చింది. వైసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కేకేకు శ్రీనివాసరావుకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్న కోణంలో విచారణ సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  YS Jagan  SIT  Srinivas Rao  KK  YSRCP office assistant  crime  

Other Articles