SC adjourns Ram Mandir hearing till Jan 2019 అయోధ్య కేసు: సార్వత్రిక ఎన్నికల ముందే ఎందుకన్న ‘సుప్రీం’

Ayodhya case supreme court adjourns hearing till jan 2019

ayodhya hearing, ayodhya hearing supreme court, ayodhya hearing in sc, ayodhya hearing in supreme court, supreme court ayodhya hearing, ayodhya hearing news, ayodhya verdict, ayodhya verdict today, ayodhya verdict hearing, ayodhya verdict news, ayodhya verdict supreme court, ayodhya, ramjanambhoomi, babri masjid, allahabad high court, supreme court

The Supreme Court adjourned the hearing on Ramjanambhoomi-Babri Masjid site title dispute to January 2019 when it will fix the date for commencing hearing on the matter.

అయోధ్య కేసు: అంత అత్యవసరం కాదన్న ‘సుప్రీం’

Posted: 10/29/2018 03:25 PM IST
Ayodhya case supreme court adjourns hearing till jan 2019

అయోధ్యలోని రామజన్మభూమిలో వున్న శ్రీరామ మందిరం- బాబ్రీ మసీదు టైటిల్ వివాదానికి సంబంధించిన కేసు విచారణను దేశ సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. వచ్చే ఏడాది జనవరి మాసంలో ఈ కేసు ఎప్పుడు విచారించే తేదీని వెలువరిస్తామని తెలిపింది. రామజన్మభూమి మందిరింతో పాటు బాబ్రీ మసీదు టైటిల్ కేసు వివాదానికి సంబంధించిన కేసులో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు ముందు విచారించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తరుణ్ గొగోయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై అలహాబాద్ కేసు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. విచారణ తేదీలను, ధర్మాసనం వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. 2010లో అలహాబాద్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించింది. ఆ సందర్భంగా ముగ్గురు న్యాయమూర్తులు మూడు రకాలైన అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను ఈరోజు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా గొగోయ్ మాట్లాడుతూ, వాస్తవానికి జనవరిలో కూడా ఈ పిటిషన్లపై విచారించాల్సిన అవసరం లేదని... సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు దీనిపై విచారణ అనవసరమని చెప్పారు. తరుపరి విచారణను జనవరికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి... నాలుగు నిమిషాల్లో విచారణను ముగించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ayodhya  ramjanambhoomi  babri masjid  allahabad high court  supreme court  

Other Articles