Retired judge TN Rao joins Jana Sena జనసేనాలోకి రిటైర్డు న్యాయమూర్తి టీఎన్ రావు

Retired judge tn rao joins jana sena party

Jana sena, Pawan Kalyan, retired judge, TS rao, land reforms, farmers problems, pawan kalyan welcomes ts rao in to JSP, Jana Sena Party chief, Andhra pradesh, special status, andhra pradesh, politics

Retired judge TN Rao joins Jana Sena party in the leadership of pawan kalyan, says his experience in soving out farmers problems and land reforms will be wholy utilised to the party

జనసేనాలోకి రిటైర్డు న్యాయమూర్తి టీఎన్ రావు

Posted: 10/27/2018 10:52 AM IST
Retired judge tn rao joins jana sena party

జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కల్యాణ్ అలోచనా విధానాలు, పార్టీ సిద్దాంతాలు నచ్చి. రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా వున్న అనేక మంది మేధావులు కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు. మరీ ముఖ్యంగా తనకు డబ్బుపై వాంఛ లేదని, ఇక సెలబ్రిటీ స్టేటస్ ను అస్వాధిస్తున్న తనకు అధికారంపై మోజు, వ్యామోహాలు కూడా లేవని ఆయన బాహాటంగానే  స్పష్టం చేస్తున్నారు.

అయితే కేవలం రాష్ట్ర అభివృద్ది.. తన అభిమానించి ఓ గుర్తింపును ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత మేలు చేయడానికి తాను రాజకీయ అరంగ్రేటం చేశానని కూడా పలు సందర్భాలతో ఆయన కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పర్యావరణ సమతుల్యతను పాటించే అభివృద్దితో పాటు రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజాసంక్షేమే పరమావధిగా.. కులరహిత సమాజంవైపు పయనించేందుకు కృషి చేస్తామని కూడా జనసేనాని తెలిపారు.

పవన్ కల్యాణ్ ఈ విధానాలు, సిద్దాంతాలు నచ్చిన ఎంతో మంది ఆయన పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయాలని కూడా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మధ్యతరగతి వర్గాల్లోని మేధావులు కూడా రాజకీయాల్లోకి రావాలని పవన్ గతంలో ఇచ్చిన పిలుపును అందుకుని ఎంతోమంది ఆయన పార్టీలో చేరారు. తాజాగా..గుంటూరుకు చెందిన విశ్రాంత న్యాయమూర్తి టీఎస్ రావు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్ లో పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

అనంతరం టీఎస్ రావు మాట్లాడుతూ.. పవన్ ప్రకటించిన విజన్ డాక్యుమెంటులోని అంశాలు, జనసేన ఏడు సిద్ధాంతాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు అవసరమని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. రైతు సమస్యలు, భూ సంస్కరణల అమలు తీరుపై తనకున్న అవగాహన, అనుభవాన్ని పార్టీ కోసం వినియోగిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి ముత్తంశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana sena  Pawan Kalyan  retired judge  TS rao  land reforms  farmers problems  andhra pradesh  

Other Articles