Pawan Kalyan In Lucknow To Meet Mayawati లక్నోకు జనసేనాని.. మాయావతితో భేటీ..

Pawan kalyan goes to lucknow for important meet with mayawati

Pawan Kalyan, Janasena, Pawan Kalyan news, Pawan Kalyan updates, Pawan Kalyan latest, Pawan Kalyan in Lucknow, Pawan Kalyan with Mayawati, Pawan Kalyan to meet Mayawati, Pawan Kalyan meeting with Mayawati, Pawan Kalyan In Lucknow To Meet Mayawati andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan today rushed to Lucknow to meet BSP Chief Mayawati. He landed in Lucknow this morning along with Nandendla Manohar and is said to have a crucial meeting with Mayawati.

లక్నోకు జనసేనాని.. మాయావతితో భేటీ..

Posted: 10/24/2018 03:41 PM IST
Pawan kalyan goes to lucknow for important meet with mayawati

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. వామపక్ష పార్టీలతో కలసి రాష్ట్ర ఎన్నికల బరిలో దిగుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సయమంలో అప్పుడే ఆ పార్టీ అటు జాతీయ రాజకీయాలపై కూడా దృష్టి మళ్లించింది. ఈ క్రమంలో జనసేనాని ఇవాళ ఉదయం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకున్నారు. ఏ మాత్రం ముందస్తు సమాచారం ఇటు మీడియాకు కానీ అటు పార్టీ ప్రతినిధులకు కానీ ఇవ్వకుండా పవన్ నేరుగా లక్నోకు చేరుకున్నారు.

పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్, పలువురు జనసేన ప్రతినిధులు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు, విద్యావేత్తలు కూడా లక్నో‌కు వెళ్లారు. అక్కడ వీరందరితో కలసి పవన్ కల్యాణ్ బీఎస్పీ అధినేత మాయావతితో భేటీ కానున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల కూటమి ప్రధాని అభ్యర్థిగా మాయావతి పేరు వినిపిస్తుండడంతో భవిషత్ రాజకీయాలపై జాతీయ నాయకులతో చర్చించాలని పవన్ నిర్ణయించిట్లు తెలుస్తుంది.

లక్నోలో పలు పార్టీల ముఖ్య నేతలతో జరిగే సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన అఖిలేష్ యాదవ్ తోనూ భేటీ అవుతారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. వీరితో పాటు జనసేనాని మరికొందరు నేతలనూ కలుస్తారని తెలుస్తోంది. వీరిమధ్య సాగే చర్చలపై ఎటువంటి సమాచారం లేకున్నా, బీజేపీకి వ్యతిరేకంగా ప్రారంభించాలని చూస్తున్న రాజకీయ పార్టీల కూటమిపై చర్చించేందుకు పవన్ వెళ్లినట్టు సమాచారం. అదే సమయంలో  కాంగ్రెస్‌తో  బీఎస్పీ విభేదిస్తుందన్న వార్తల నేపథ్యంలో భేటి కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  mayawati  lucknow  nadendla manohar  andhra pradesh  politics  

Other Articles