Petrol, diesel price cut for third-consecutive day వాహనదారులకు కాసింత ఉపశమనం.. తగ్గిన ఇంధన ధరలు

Petrol prices cut by 39 paise in delhi diesel goes down 12 paise

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Amid a reduction in global crude oil prices, fuel prices across the country witnessed further reduction on Saturday, bringing citizens some much-needed relief.

వాహనదారులకు కాసింత ఉపశమనం.. తగ్గిన ఇంధన ధరలు

Posted: 10/20/2018 01:10 PM IST
Petrol prices cut by 39 paise in delhi diesel goes down 12 paise

గత కొన్ని నెలలుగా విపరీతంగా పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు అల్ టైం హై రికార్డులను అధిగమించి.. వాటి రికార్డులను అదే బద్దలుకొట్టుకుని శతకం మార్కుకు చేరువగా పరుగులు తీస్తున్న దూసుకెళ్తున్న ధరలకు వరుసగా మూడు రోజుల నుంచి బ్రేకులు పడుతున్నాయి. రోజువారీగా ఇంధన ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలతో అనుసంధానం చేసిన తరువాత కేవలం ఒక్క పైసా మేర తగ్గిన ఘనతను కూడా తమ ఖాతాలో వేసుకున్న చమురు సంస్థలు.. దానితో పోల్చితే ఇవాళ భారీగానే ఇంధన ధరను తగ్గించి వాహనదారులకు ఉపశమనం ప్రకటించారు.

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడోరోజు (అక్టోబరు 20న) తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 39 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.81.99 కి చేరింది. డీజిల్ ధర 12 పైసల మేర తగ్గి రూ.75.36కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో 38 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.87.46కి చేరింది. డీజిల్ ధర 13 పైసలు తగ్గి రూ.79.00 కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 41 పైసలు తగ్గి రూ.86.92, డీజిల్ ధర 13 పైసలు తగ్గి రూ.81.97 కి చేరింది. విజయవాడలో 22 పైసలు తగ్గిన పెట్రోల్ ధ‌ర రూ.86.61 ఉండగా.. డీజిల్ ధర 11 పైసలు తగ్గి రూ.80.85 గా కొనసాగుతోంది.

కోల్‌కతాలో పెట్రోలు ధర 38 పైసలు, డీజిల్ ధర 12 పైసలు తగ్గింది. దీంతో పెట్రోలు ధర రూ.83.83 ఉండగా.. డీజిల్ ధర రూ.77.21 గా ఉంది. చెన్నైలో పెట్రోలు 41 పైసలు, డీజిల్ 13 పైసలు తగ్గింది. దీంతో అక్కడ పెట్రోలు ధర రూ.85.22 ఉండగా.. డీజిల్ ధర రూ.79.69గా ఉంది. ఇక ఐటీ నగరం బెంగళూరులో పెట్రోలు 39 పైసలు, డీజిల్ 12 పైసలు తగ్గింది. ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.82.64 ఉండగా.. డీజిల్ ధర రూ.75.75 వద్ద కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles