Devotees force woman journalist to turn back శబరిమల వద్ద రెండో రోజు అదే ఉద్రిక్తత..

Tension at peak on second day at sabarimala 144 section imposed

Lord Ayyappa, lady journalists, sabharimala women journo, Ayyappa swamy temple, Nilackal, women, protesters, kerala police, Sabrimala, sabrimala women, sabrimala kerala, Sabrimala temple, sabrimala entry, kerala goverment

A Delhi-based woman journalist of a foreign media outlet, who trekked the Sabarimala Hill, was Thursday stopped midway by Lord Ayyappa devotees opposing entry of women of menstrual age into the hill shrine.

రెండో రోజు అదే సీన్..శబరిమల వద్ద ఉద్రిక్తత.. 144 సెక్షన్..

Posted: 10/18/2018 01:14 PM IST
Tension at peak on second day at sabarimala 144 section imposed

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయం తలుపులు తెరిసిన తరువాత ఆలయ ప్రవేశం చేసి.. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళా భక్తులకు రెండో రోజు కూడా చుక్కెదురవుతుంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు అన్ని వయసుల మహిళలకు అనుమతినిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన క్రమంలో.. మహిళా భక్తులు స్వామివారి దర్శనానికి రావడం.. వారిని అందోళనకారులు అడ్డుకోవడంతో నిన్న ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం అలుముకుంది.

మహిళా భక్తులకు రక్షణగా వున్న పోలీసులపై అందోళనకారులు రాళ్లు రువ్వడంతో.. వారిపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ క్రమంలో వార్తలను కవర్ చేసి తమ ఛానెళ్లకు ఇచ్చేందుకు వచ్చిన జాతీయ మీడియా మహిళా జర్నలిస్టులను కూడా అందోళనకారులు అడ్డుకున్నారు. వారిపై అందోళనకారులు దాడులకు దిగారు. వారు ప్రయాణిస్తున్న కార్ల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. న్యూఢిల్లీకి చెందిన న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ సుహాసినీ రాజ్, శబరిమలకు వెళ్లాలన్న ప్రయత్నం విఫలమైంది. ఆమెను అడ్డుకున్న నిరసనకారులు, రాళ్లను విసిరి తరిమారు.

తన సహచరుడైన ఓ విదేశీయుడితో కలసి ఆమె పంబ వద్దకు చేరుకుని వంతెన దాటుతుండగా మహిళా నిరసనకారులు ఆమెను అడ్డుకున్నారు. అప్పటివరకూ సుహాసినీకి రక్షణగా వచ్చిన పోలీసులు సైతం చేతులెత్తేయడంతో, వారిద్దరూ అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఇక ఆమె నడుస్తున్నంత సేపూ, తాను దేవుని దర్శించుకునేందుకు రావడం లేదని, కేవలం రిపోర్టింగ్ చేయడానికి మాత్రమే వచ్చానని అమె చెబుతున్నా, నిరసనకారులు ఎవరూ వినలేదు. అమెపై రాళ్లు రువ్వారు.

అసభ్య పదజాలంతో ఆమెను దూషిస్తూ, శబరిమలలోకి ప్రవేశానికి అనుమతించబోమని భీష్మించుకు మార్గమధ్యంలో కూర్చున్నారు. దీంతో చేసేదేమీ లేక అమె పంబకు తిరుగి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాధవి, కేరళ జర్నలిస్ట్ లిబినిలు బుధవారం శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించినా, వారి కూడా ఇదే విధమైన అనుభవం ఎదురయ్యింది. కాగా, శబరిమలలో ఆలయ తలుపులు తెరచిన తరువాత ఇంతవరకూ నిషేధిత వయసులో ఉన్న ఏ మహిళా స్వామిని దర్శించుకోలేదు.

మరోవైపు శబరిమలలోకి మహిళ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ శబరిమల సంరక్షణ సమితి 24 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. కొజికోడ్‌, అటింగళ్‌, ఛెథ్రాలల్లో కేఎస ఆర్టీసీ బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. కేరళలోని అన్ని దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. బీజేపీ సైతం ఈ బంద్ కు మద్దతు ప్రకటించింది. ఈ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆలయ ద్వారాలు తెరుచుకోగా, మహిళా భక్తులు ఎవరూ స్వామి దర్శనం చేసుకోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sabrimala temple  Lord Ayyappa  Nilackal  women  protesters  kerala police  kerala goverment  

Other Articles