pawan dares AP govt to conduct elections దమ్ముంటే పంచాయితీ ఎన్నికలు నిర్వహించండీ: పవన్

Janasena chief pawan kalyan lashesout at tdp scams

pawan kalyan, janasena, Dhavaleshwaram Barriage, mass march, Kavathu, Pawan Kalyan Dhawaleshwaram, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan east godavari, Pawan Kalyan kostandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan lamblashes at chandrababu and nara lokesh on false promises at Dhavaleshwaram barriage.

ITEMVIDEOS: చంద్రబాబు, లోకేష్ లపై పవన్ కల్యాణ్ విసుర్లు..

Posted: 10/15/2018 07:46 PM IST
Janasena chief pawan kalyan lashesout at tdp scams

జనసేన ఏ పార్టీకి అండగా వుండదని మరోమారు జనసేనాని పవన్ కల్యాణ్ పునర్ధుద్ఘాటించారు. తనకు నరేంద్రమోడీ అన్న కాదని, బీజేపితో తాను దోస్తీ చేయడం లేదని అన్నారు. సొంత సోదరుడ్నే కాదని తాను జనసైన్యం పార్టీని పెట్టానని అన్నారు. తాను బీజేపితో చేయి కలిపానని, తనపై తెలుగుదేశం పార్టీ విషప్రచారం చేస్తుందని ఆయన అరోపించారు. తాను టీడీపీతో కలసి వున్న నాలుగేళ్ల సమయంలో ఎన్నడూ ప్రత్యేక హోదా గురించి అడగకుండా.. కనీసం ఢిల్లీకి తీసుకెళ్లి తమతో అడిగించే ప్రయత్నం కూడా చేయకుండా ఇప్పుడు తాము బిజేపితో అంటకాగుతున్నామని అబద్దాలను ప్రచారం చేస్తారా.. అని పవన్ ప్రశ్నించారు.

కేంద్రప్రభుత్వం మనల్ని మోసం చేస్తుందని, అధికార, విపక్ష ఎంపీలు సొంత పనులకే పరిమితం అవుతన్నారని ప్రత్యేక హోదా కోసం తాను తిరుపతి నుంచి గళమెత్తితే.. కాకినాడకు వచ్చేసరికి కేంద్రం పాచిపోయిన లడ్డూలను చేతిలో పెట్టింది. అది పాచిపోయిన లడ్డూలు అని తాను చెబితే.. పవన్ కల్యాణ్ కు ఏం తెలుసు.. అహా అమోఘం, అద్బుతం అంటూ.. బీజేపి నాయకులకు మంగళస్నానాలు చేయింది.. వారికి పట్టువస్త్రాలు వేసి.. వారిని ఎంతో గౌరవమర్యాదలతో సన్మానాలు చేసిన టీడీపీ.. ఇప్పడు అంతా మోసం, ద్రోహం అంటూ దొంగదీక్షలకు చేపడుతుందని పవన్ విమర్శించారు. ఇప్పటికైనా అఖిలపక్ష పార్టీలను ఢిల్లీ తీసుకెళ్లి హోదా గురించి కేంద్రాన్ని డిమాండ్ చేద్దామా.? మేం రెడీ మీదే అలస్యమని పవన్ ఛాలెంజ్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెడుతున్న క్రమంలో ఇవాళ ధవళేశ్వరం బ్యారేజీపై నిరసన కవాతు నిర్వహించిన పవన్ కల్యాణ్.. టీడీపీ పార్టీని, చంద్రబాబు, నారా లోకేష్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను ఏ దశలోనూ తన జనసైనికులను రెచ్చగోట్టటని, ఎందుకంటే తాను సై అంటే వారేం చేస్తారో తనకు తెలుసునన్నారు. తమ జనసైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు అని.. దౌర్జన్యాలను చీల్చిచండాడే కొదమ సింహాలని, అవినీతి వ్యవస్థను ముంచేసే ఉధృత జలపాతాలని పవన్ అభివర్ణించారు.

ఏ దేశంలోనైనా సామాన్యులు కవాతు చేయరని.. కేవలం దేశ సైనికులు కవాతు చేస్తారని, అలాంటిది.. జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. జనసైనికులు ఎందుకు కవాతు చేయాల్సి వచ్చిందని పవన్ ప్రశ్నించారు. ‘సూర్యుడు నుంచి సూర్యుడికి 24 గంటల దూరం. మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం. గ్రామం నుంచి సంగ్రామానికి ఇంకెన్ని తుపాకులు దూరం’ అని పవన్ అన్నారు. సగటు రాజకీయ వ్యవస్థ కుల్లిపోయి, అవినీతితో నిండిపోవడంతో నిరుద్యోగంతో రగిలిపోతున్న యువత ఈ రోజున జనసేన కవాతులో పాల్గొన్నారని చెప్పారు. అవినీతిని ప్రక్షాలన చేయడానికి, దోపిడీ వ్యవస్థను నిర్మూలించడానికి యువత నడుం బిగించిందని.. అదే జనసేన కవాతు ముఖ్యోద్దేశం అని స్పష్టం చేశారు.

రాజకీయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతున్న ఈ తరుణంలో సగటు సామాన్యుల నుంచి, మధ్యతరగతి మేధావుల నుంచి, ఆడపడుచుల నుంచి ఒక విప్లవం రావాలని పవన్ పిలుపునిచ్చారు. వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోన్న రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలని, వారి దోపిడీలను నిలువరించాలని, అందుకే ఈ కవాతు చేస్తున్నామని ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు యువతకు ఎన్నో హామీలిచ్చి వాటిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. యువతకు ఉద్యోగాల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన తరువాత వీరు ఆ మాటలే మర్చిపోయారని ఆయన విమర్శించారు.

పవన్ కళ్యాణ్ దగ్గర వేల కోట్లు లేవు. మా తాతలు గనుల మీద వ్యాపారాలు చేయలేదు. మా నాన్న నాకు బలమైన విలవలు మాత్రమే నేర్పారని పవన్ చెప్పారు. అబద్దపు సొమ్ముతో, అక్రమార్జనతో మనం ఏ పని చేసినా అవి సహకరించవని చెప్పారన్నారు. మనకున్న దాంట్లో సర్ధుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్పారన్నారు. అందుకే వేల కోట్ల ఆస్తులపై నాకు ఆసక్తి లేదు. డిగ్రీ పాసై ఎస్సై ఉద్యోగం వస్తే బాగుండు అని కోరుకున్నాను. కానీ భగవంతుడు నన్ను సినిమాల్లో పెట్టాడు’ ఇన్ని కోట్ల మంది అభిమానులు తనకు చేరువయ్యేలా చేశాడని పవన్ కళ్యాణ్ ఉద్వేగభరింతంగా ప్రసంగించారు.

సినిమాలు చేస్తే సంవత్సరానికి రూ.100 కోట్లు పైగా సంపాదించగలనని చెప్పిన ఆయన.. దాన్ని వదిలి రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానన్నారు. ఎందుకొచ్చావ్ రాజకీయాల్లోకి అంటే నిజంగా ఇప్పుడీ ప్రశ్న చాలా బాధ కలిగిస్తుందని అన్నారు. తాను పెరిగి పెద్దయితే సమాజం బాగుంటుందని చిన్నప్పుడు ఆశించేవాడిని. కానీ ఇంత హీనంగా తయారైందని పవన్ అందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం తనకు బలముండి, శక్తి ఉండి, భావజాలం ఉండి, పోరాటం చేయగలిగే సత్తా ఉండి ఈ వ్యవస్థ పట్ల బాధ్యత తీసుకోకపోతే ప్రజలు పరిస్థితి ఎలా తయారవుతుందోనని ఊహించుకోడానికే భయమేసి.. రాజకీయాల్లోకి వచ్చానని పవన్ వివరించారు.

అందుకే తాను జనసేన పార్టీని స్థాపించానని, 2009 నుంచి అనుభవాన్ని సంపాదించానని, 2014లో కూడా అనుభవం వున్న నాయకులు రాష్ట్రముఖ్యమంత్రి అయితే బాగుంటుందని తాను టీడీపీకి మద్దతు పలికానని అన్నారు. తాను ప్రత్యేక హోదా అంటూ ఏడాదిన్నర పాలన అయినప్పటి నుంచి అడుగుతుంటే ఎవరికీ పట్టలేదు. పవన్ కల్యాణ్ సినిమా స్టార్ అయనకేం తెలుసు అంటున్నారు. అంతేకాదు భయాందోళనకు కూడా గురిచేస్తున్నారు. ముఖ్యమంత్రి తనను చాలా గౌరవిస్తారని, అయితే అదే సమయంలో తన జనసేన పార్టీ మాత్రం ఎదగకూడదు.. రాజకీయంగా తాను అసంతృప్తితో తప్పుకునేలా ప్రణాళికలు రచించారని దుయ్యబట్టారు.

తనకు ముఖ్యమంత్రి పదవి అలంకారం కాదు. చంద్రబాబు, లోకేష్‌, జగన్ లాగా వారసత్వంతో తాను రావడం లేదని.. ప్రజల కష్టనష్టాలను అకళింపు చేసుకుని, దశాబ్దమున్నర కాలం పాటు అనుభవాన్ని గడించిన తరువాత తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని అన్నారు. ఓ కానిస్టేబుల్ కొడుకు, ఓ పోస్టుమ్యాన్ మనవడు పార్టీ పెట్టాడని అన్నారు. పోస్టుమ్యాన్ మనవడు.. ఈ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రి కాలేడు.. ఓ కానిస్టేబుల్ కొడుకు ఎందుకు సీఎం పదవిని చేపట్టలేదో చూద్దామని పవన్ కల్యాణ్ భీష్మించారు.

ఇక అదే సమయంలో జగన్, లోకేష్ లపై విరుచుకుపడిన పవన్.. వారసత్వంతో ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు. కనీసం పంచాయితీ మెంబర్ గా కూడా గెలవలేని నారా లోకేష్ కు ఏం తెలుసునని పంచాయితీ రాజ్ శాఖ మంత్రిత్వబాధ్యతలను అప్పగించారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పంచాయితీ రాజ్ చట్టం గురించి ముందు తెలుసుకుని ఆ తరువాత మంత్రిత్వ బాధ్యతలను చేపట్టాలని సూచించారు. ఒక కిర్లంపూడి మండలంలోని ఓ గ్రామ సర్పంచ్ చెత్త నుంచి సంపదను రాబట్టంతో దానిని అమెరికాకు అమ్మిన చంద్రబాబు.. ఐక్యరాజ్యసమితిలో ప్రకృతి సేద్యంపై ఉపన్యాసం ఇచ్చారని, కానీ గ్రామ సర్పంచులకు మాత్రం చెక్ పవర్ లేకుండా జన్మభూమి కమిటీలకు బాధ్యతలను అప్పగించారని దుయ్యబట్టారు. ఆ కమిటీలు గుండా కమిటీలుగా తయారయ్యాయని మండిపడ్డారు.

ఈ అనుభవంలో ఎన్నో దెబ్బలు తిన్నాం. మరెన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. చేయని తప్పుకి నెలలుగా అవమానాలు ఎదుర్కొన్నాం. భంగ పడ్డాం. కన్న తల్లిని దూషించుకున్నాం. పడ్డాం అవమానాలు. ఎందుకు పడ్డాం, పౌరుషం లేదా మాకు.. ఉప్పు కారం తినలేదా మేం. మాకు అవమానాలు రావా? పౌరుషాలు ఉండవా. ఆకాశంలో నుండి ఊడిపడ్డారా మీరు. ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. తేడాలొస్తే.. తాట తీస్తాం. ‘రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారని అవన్నీ ప్రకటనలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. జీలకర్రలలో కర్రాలేదు. నేతి బీరకాయలో నెయ్యి లేదు. బాబు జేబులో జాబులేదని ప్రజలు సెటైర్లు వేసుకుంటున్నారని పవన్ అన్నారు.

అధికారంలోకి వస్తే అసంఘటిత కార్మికులకు, రోడ్డుపై వ్యాపారాలు చేసే వారికి బాసటగా నిలుస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగులు తమ ముప్పై ఏళ్లకు పైగా సేవలందించిన తరువాత వచ్చే డబ్బుపై కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేస్తామని ప్రకటించారు. పశ్చిమ గోదావరిలో తన మూలాలు వున్నాయని.. అయితే జిల్లాలో్ అన్ని సమస్యలను తెలుసుకుంటాం. భయమున్నోడు పెట్టడు.. గెలుపు అందుకోలేమని అనుకున్నోడు అడగడు.. కానీ జనసేన పార్టీ పదే పదే అడుగుతుంది. మా సత్తా ఎంటో కూడా నిరూపిస్తామని చెబుతన్నా ఎన్నికలకు నిర్వహించడం లేదని నిలదీశారు. ఎన్నికలపై కాలయాపన చేస్తూ ప్రభుత్వమే రాజ్యంగేతర శక్తిగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  east godavari  dhavaleshwaram  kavathu  andhra pradesh  politics  

Other Articles