3 Lakh, Kill Cashier In Delhi Bank..బ్యాంకు దోపిడి, క్యాషియర్ పై కాల్పులు

Delhi bank robbery caught on cctv camera cashier shot dead

robbery in delhi today, robbery in delhi, biggest robbery in delhi, bank robbery in delhi, robbery news in delhi, bank robbery in delhi, bank robbery in broad day light, bank robbery in delhi today, dwarka, chhawla, corporation bank, khaira, southwest delhi, crime

In a shocking case of robbery, a cashier of Corporation Bank was shot dead in New Delhi’s Dwarka today. The incident took place at a branch of Corporation Bank in Chhawla area in southwest Delhi.

ITEMVIDEOS: మిట్టమధ్యాహ్నం బ్యాంకు దోపిడి, క్యాషియర్ పై కాల్పులు

Posted: 10/13/2018 03:12 PM IST
Delhi bank robbery caught on cctv camera cashier shot dead

ఢిల్లీలో పట్టపగలే బ్యాంక్ దోపిడీ జరిగం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. బ్యాంకు సిబ్బందితో పాటు కస్టమర్లు కూడా తక్కువ సంఖ్యలోనే వున్న మిట్టమధ్యాహ్న సమయంలో అందరూ చూస్తుండగానే మాస్క్‌లు ధరించి చేతిలో ఆయుధాలతో వచ్చిన గుర్తు తెలియని అగంతకులు బ్యాంక్ ను దోపిడి చేశారు. అడ్డుకున్న క్యాషియర్‌ సంతోష్‌కుమార్‌ (45) ని తుపాకితో కాల్చి చంపారు. ఈ ఘటనలో మొత్తంగా నలుగురు గాయపడ్డారు.

వాయువ్య ఢిల్లీ ప్రాంతంలోని ద్వారక పరిసరాల్లోని చావ్లా ఏరియాలో వున్న  కార్పోరేషన్‌ బ్యాంకు బ్రాంచిలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రితం రోజు మధ్యహ్నం జరిగిన ఈ ఘటన తాలుకూ వివరాలు ఇలా వున్నాయి. మధ్యహ్నం కస్టమర్లు కూడా పెద్దగా లేని సమయంలో అక్కడు వున్న తమ వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్న ముష్కరులు.. మిట్టమధ్యాహ్నం బ్యాంకులోనికి ప్రవేశించగానే చేతిలోకి ఆయుధాలు తీసుకుని కస్టమర్లను, బ్యాంకు సిబ్బందిని భయాంధోళనకు గురిచేశారు. వారిని అడ్డుకున్న సెక్యూరిటీపై దాడి చేశారు.

బ్యాంకు దోపిడీని అడ్డుకునే ప్రయత్నం చేసిన క్యాషియర్ సంతోష్‌ కుమార్ పై ముష్కరులు కాల్పులు జరిపారు. తొలుత తాము కాల్పులు జరపమని చెప్పిన దొంగలు అడ్డుకున్న సంతోష్ కుమార్ పై మాత్రం కాల్పులతో తెగబడ్డారు. ఈ దోపిడీలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, ముఖాలకు మాస్క్‌లు ధరించి, తుపాకులతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. సంతోష్ కుమార్ చాతిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకుని తాము సంఘటనాస్థలికి వచ్చేలోపే దుండగులు తప్పించుకున్నారని, రక్తపు మడుగులో ఉన్న సంతోష్‌ కుమార్ ను వెంటనే ఆసుపత్రికి తరలించామని కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ దోపిడీలో మూడు లక్షల రూపాయలను అగంతకులు ఎత్తికెళ్లినట్లు బ్యాంకు ఉద్యోగులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ బ్యాంకు దోపిడికీ సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bank robbery  delhi  dwarka  chhawla  corporation bank  khaira  southwest delhi  cashier  crime  

Other Articles