Damodara Raja Narasimha wife's U turn మనసు మార్చకుని మాతృపార్టీలోకి పద్మినీరెడ్డీ

Damodara raja narasimha wife padmini reddy rejoins congress

damodara rajanarsimha, Padmini Reddy, BJP, Congress, swami paripoornananda, amit shah, deputy CM, Telangana, Politics

C Padmini Reddy, the wife of Telangana Congress Election Manifesto committee chairman Damodar Raja Narasimha, has joined BJP and within few hours she had changed her decision and rejoined congress to follow footsteps of her husband.

అలా చేరింది.. ఇలా మనసు మార్చకుని మాతృపార్టీలోకి పద్మినీరెడ్డీ

Posted: 10/12/2018 12:26 PM IST
Damodara raja narasimha wife padmini reddy rejoins congress

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు భారీ షాక్ ఇస్తూ.. ఆ పార్టీ సీనియర్ నేత.. మాజీ ఉపముఖ్యమంత్రి, ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే అలా చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే అమె మళ్లీ యూటార్న్ తీసుకున్నారు. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలవాలని గత రెండు పర్యాయాలుగా ప్రయత్నాలు చేసి విఫలమైన ఆమె.. బీజేపిలో చేరారు.

కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తన ఆశ నెరవేరదని బీజేపి తీర్థం పుచ్చుకుని ఏకంగా జాతీయ నేత మురళీధర్ రావు, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో కాషాయ కండువాను కప్పుకున్న విషయం తెలిసిందే. అమె చేరిక తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామానికి దారి తీసింది. దామోదర రాజనర్సింహకు.. పద్మినీ రెడ్డికి మధ్య ఎలాంటి విభేధాలు కూడా లేవని సమాచారం. అలాంటప్పుడు అమె భర్త పార్టీని కాదని బీజేపిలోకి ఎందుకు చేరారన్న విషయమై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఈ తరుణంలో అమె బీజేపిలో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ అమె తిరిగి మాతృసంస్థకు చేరుకున్నారు. గంటల వ్యవధిలోనే పద్మినీ రెడ్డి తన మనసు మార్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ పాలపై వున్న నమ్మకంతోనే తాను బీజేపిలో చేరానని చెప్పిన అమె.. కొన్ని గంటల్లోనే తిరిగి సోంతపార్టీకి రావడంతో మోడీ పాలనపై నమ్మకం అప్పుడే సడలిపోయిందా.? అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

 తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానంటూ ఆమె సంచలన ప్రకటన చేశారు. తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ ఆయనకు రాజకీయంగా సంపూర్ణంగా సహకరించేందుకు కూడా తాను సిద్దమని అమె చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకున్నానని, అందుకే, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. ఇంత ప్రతిస్పందన ఉంటుందని తాను ఊహించలేదని, బీజేపీలోకి వెళ్లడం అనుకోకుండా జరిగిన సంఘటనని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles