HC permits EC to announce new voter list ఓటర్ల జాబితా అవకతవకలపై విచారణ 12కు వాయిదా

High court reserves verdict on telangana assembly dissolution

dk aruna, congress, kcr, TRS, Election commission, high court, supreme court, marri shashidar reddy, voter list, assembly dissolution, bogus voters, votes missing, early elections, early polls, telangana election shedule, five state elections 2018

High Court reserves its verdict on the two petitions filed by Telangana Congress leader DK Aruna, and postpones on the next hearing of voter list to 12th, and gives green signal to EC to announce new voter list.

అసెంబ్లీ రద్దు, ఎన్నికల షెడ్యూలు విడుదలపై తీర్పు రిజర్వు..

Posted: 10/10/2018 03:52 PM IST
High court reserves verdict on telangana assembly dissolution

ఓటర్ల జాబితా అవకతవకల పిటిషన్ పై ఈ నెల 8నే విచారణ చేపట్టాలని దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల నేపథ్యంలో ఓటరులిస్లు అక్రమాలపై అదే రోజున న్యాయవాది జంద్యాల రవిశంకర్ సహా సీనియర్ కాంగ్రెస్ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్లపై తదుపరి విచారణను ఇవాళ కోనసాగించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు.. విచారణ జరిపింది. ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడెపిట్ దాఖలు చేయడంతో ఇరువైపుల నుంచి వాదప్రతివానలు కొనసాగాయి.

పిటిషన్ లోని ఒక్క అంశం కూడా చెల్లదని ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు వాదించింది. పిటిషనర్ సమర్పించిన జాబితాలో తప్పులు ఉన్నాయని, 2016-17 ఓటర్ల లిస్టు ఇప్పుడు చూపిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేస్తామనంటూ ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఒకే అడ్రస్‌తో వేల ఓట్లు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈసీ వెబ్ సైట్ నుంచి తీసుకుని కోర్టుకు జాబితా సమర్పించామని చెప్పారు.

బోగస్ ఓట్లను ఎలా తొలగిస్తారు? తొలగించిన ఓట్లను ఎలా కలుపుతారో చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. ఓటరు నమోదు ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఓటరు నమోదుకు ఎలాంటి ప్రాతిపదికలు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. వీటన్నింటిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఈసీకి చీఫ్ జస్టిస్ ఆదేశించారు. ఓటర్ల జాబితా బూత్‌ స్థాయి లిస్టు ఇవ్వాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.

అలాగే ఈనెల 12న ఓటర్ లిస్ట్ ప్రకటించుకోవచ్చని పేర్కొంటూ.. తదుపరి విచారణ ఈనెల 12కు వాయిదా వేసింది. కాగా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్డును విడుదల చేయడంలో కేంద్ర ఎన్నికల సంఘం అంత తొందరపాటు నిర్ణయం తీసుకోవడమేంటని, ఇక అసెంబ్లీలో సభ్యులుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలకు నామమాత్రం కూడా సమాచారం లేకుండా మంత్రిమండలి ఏకపక్షంగా అసెంబ్లీ రద్దుకు ఎలా వెళ్తుందని ప్రశ్నిస్తూ డీకే అరుణ, శశాంక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఇరువైపులా వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : marri shashidar reddy  dk aruna  congress  kcr  TRS  Election commission  high court  

Other Articles