perished laddus sale at Yadadri Temple యాదాద్రిలో బూజుపట్టిన లడ్డూల అమ్మకం

Yadadri temple authorities distributes perished laddus

telangana tirupati, yadadri, laxmi narasimha swamy, laddus, temple prasadam, dungus in yadadri laddus, TRS, KCR, telangana

Familiar as Telangana tirupati, Yadadri Laksmi Narasimha swamy temple had distributed prasadam (laddus) which were perished and fungus is seen

బూజుపట్టిన లడ్డూలను అమ్మిన యాదాద్రి అధికారులు

Posted: 10/08/2018 02:15 PM IST
Yadadri temple authorities distributes perished laddus

తెలంగాణలోని పవిత్ర పుణ్య క్షేత్రమైన యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మరోమారు వార్తల్లోకి వచ్చింది. ఈ సారి కూడా ఎన్నో వ్యవప్రయాలకోర్చి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందికర పరిణామాలను చవిచూపించిన విషయంలోనే ఈ ఆలయం వార్తల్లోకి వచ్చింది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించి తాము సేవించిన తరువాత తమ బంధువులు, ఇరుగుపోరుగు వారి కోసం తీసుకువెళ్లే లడ్డూ ప్రసాదం పాడైపోయింది.

భక్తులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన లడ్డూలు బూజు పట్టినా.. వాటిని గమనించని ఆలయ యాజమాన్యం.. వాటిని అలాగే విక్రయించింది. దీంతో వాటిని కొనుగోలు చేసిన భక్తులు వాటిని ఆస్వాదించేందుకు ఉపక్రమించగా, లడ్డూలు పాచిపోయాయని, బూజు కూడా పట్టిందని తెలిసింది. దీంతో భక్తులు ఆలయ అధికారులను ఈ విషయమై నిలదీయడంతో నాలుక కర్చుకున్న అధికారులు వాటిని వేరే లడ్డూలతో బదలాయించినా అవి కూడా పాడైపోవడంతో.. మొత్తంగా 1800 లడ్డూలు అలాగే వున్నాయని గుర్తించి పడేశారు.

ఫలితంగా రూ.60 వేల నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. తయారీలో నాణ్యత లోపించడం, భద్రపరిచే చర్యల్లో లోపాల కారణంగా లడ్డూలు పాడై ఫంగస్ వచ్చినట్టు సమాచారం. భక్తుల రద్దీ తగ్గడంతో ప్రసాదాల విక్రయం తగ్గి.. వాటిని మరో రెండు, మూడు రోజులు అధికంగా నిల్వ వుంచాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. కౌంటర్ గదుల్లో లడ్డూలకు సరైన గాలి ఆడకపోవడంతోనే బూజు వచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఇదే ప్రసాదాన్ని చూడకుండా సేవిస్తే ఎంత ప్రమాదమని భక్తులలో అందోళన వ్యక్తం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles