UP mantri, kin in list of BPL scheme beneficiaries ఆయుష్మాన్ భారత్ జాబితాలో మంత్రి పేరు..

Up min in list of bpl scheme state orders probe

Yogi ministry, State governments of India, Government of India, Sangh Parivar, Uttar Pradesh, Keshav Prasad Maurya, Satish Mahana, Prasad, Satish, Mahana, Government of Uttar Pradesh, Kanpur, Chief Medical officer, Prime Minister, Vijay Vishwas Pant, health

Uttar Pradesh Deputy CM Keshav Prasad Maurya informed that an investigation has been ordered in the connection Minister Satish Mahana and his family members names were found listed amongst the beneficiaries of Ayushman Bharat.

ఆయుష్మాన్ భారత్ జాబితాలో మంత్రి పేరు..

Posted: 10/06/2018 11:32 AM IST
Up min in list of bpl scheme state orders probe

ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొలువుదీరిన యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వంపై అనేక విమర్శలు, అరోపణలు వస్తున్న క్రమంలో కాషాయ ప్రభుత్వంపై మరింత మకిలీ అంటేలా చేస్తున్నారు అక్కడి మంతివర్యులు. ఎవరాయన, ఆయన చేసిన పనేంటి అంటే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన మంత్రి సతీశ్ మహానా. దేశంలోని కడు పేదలకు, బీద ప్రజలకు మాత్రమే వర్తించే కేంద్ర ప్రభుత్వ పథకంలో ఆయన తన కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చారు. దీంతో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎంత పేదవారో ఇట్టే తెలిసిపోతుంది.

విషయంలోకి ఎంటరైతే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ గత నెల 25 నుంచి ప్రారంభమైంది. ఈ పథకం కింద దేశంలోనే అనేక మంది పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలను అందించనుంది. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న వారి కోసం ఉద్దేశించిన ఈ పథకంలో మంత్రి సతీశ్ తోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు.

లబ్ధిదారుల జాబితాలోకి మంత్రి, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్టు మౌర్య తెలిపారు. మంత్రి పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కనీస వైద్యం చికిత్స కోసం కూడా ఖర్చు చేయలేని వారి కోసమే ఈ కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి వివరించారు. ఈ పథకం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yogi ministry  Keshav Prasad Maurya  Satish Mahana  Ayushman Bharat  Uttar Pradesh  

Other Articles