History-sheeter arrested after dramatic escape bid తప్పించుకునే క్రమంలో పోలీసులపై బాంబులు..

Under trial prisoners make dramatic bid to escape from police custody

Contai, West Bengal, States and union territories of India, General Register Officer, UN Court

Three prisoners, who are currently under trial, make a bid to escape from the police custody in East Midnapore in West Bengal on Thursday.

ITEMVIDEOS: పోలీసులపై బాంబులు.. తప్పించుకునే క్రమంలో మళ్లీ అరెస్టు

Posted: 10/04/2018 07:00 PM IST
Under trial prisoners make dramatic bid to escape from police custody

రిమాండ్ ఖైదీలు పోలీసులపై విభిన్న తరహలో ప్రతీకారం తీర్చుకోవాలని యత్నించారు. ఈ క్రమంలో వారు కొంతమేర సఫలం కూడా అయ్యారు. ఆ తరువాత మాత్రం కథ రివర్స్ అయ్యింది. తామెక్కటి తలిస్తే.. విధి మరోకటి తలచిందన్న నేపథ్యంలో వారు తిరిగి పోలీసులు అదుపులోకి వెళ్లారు. ఔనా నిజమేనా ఈ ఘటన ఎక్కడ జరిగింది.? ఎలా జరిగింది.? తప్పించుకునేందుకు, పోలీసులపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు పన్నిన ఎత్తగడ ఏంటీ అన్న వివరాలు తెలుసుకోవాలంటే..

పశ్చిమబెంగాల్ లోని ఈస్ట్ మిడ్నాపూర్ ముగ్గురు పాత రౌడీషీటర్లు అలజడి రేపారు. ముగ్గురు పాత రౌడీ షీటర్లను తమ కస్టడీలో విచారణ చేసిన పోలీసులు.. వాళ్లను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు తీసుకుని వెళ్తుండగా.. వారు పోలీసుల నండి తప్పించుకుని పారిపోయేందుకు చేసిన యత్నం బెడిసికోట్టింది. పోలీసుల నుంచి తప్పించుకున్న పాత నేరస్తులు.. తమ వెంట పోలీసులు పడకుండా వారిపై నాటు బాంబులు విసురుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు.

క్రిమినల్స్ పారిపోవడం, బెదిరించడం చూసి జనం అరుపులు, కేకలు పెట్టారు. ముందుగా ఓ టూ వీలర్ ఎక్కి పారిపోయేందుకు ట్రై చేశారు. అది వెంటనే స్టార్ట్ కాలేదు. తర్వాత ముగ్గురు నిందితులు దానిపైనే పారిపోతుండగా.. స్థానికులు, పోలీసులు అడ్డుకోడానికి ప్రయత్నించారు. అయితే.. తమ వెంటపడుతున్న పోలీసులను భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నించిన రౌడీషీటర్లు వారిపై బాంబులు విసిరారు. అడ్డొస్తే చంపేస్తామంటూ బెదిరించారు.

కొందరు తమ ఫోన్లతో ఈ వీడియోలు తీసి పోలీసులకు ఘటనస్థలానికి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులకు అందించారు. ఈస్ట్ మిడ్నాపూర్ లోని కొంటాయ్ కోర్టుకు తీసుకుని వెళ్తుండగా.. రౌడీషీటర్స్ ఇంతటి దారుణానికి తెగబడ్డారు. బాంబులు విసరడంతో.. కొందరికి గాయాలయ్యాయి. ముగ్గురు నిందితుల్లో ఒకడైన కర్ణబేరాను పోలీసులు వెంబడించి పట్టుకుని అరెస్ట్ చేశారు. జనంపై బాంబ్ విసిరింది కూడా అతడే. అయితే మరో ఇద్దరని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles