Sye Raa Actor Sudeep Injured నటుడి కోసం.. అభిమానుల పూజలు..

Kannada hero and multi lingual actor sudeep injured in road accident

sudeep, kiccha sudeep, kannada hero, sye raa actor, sandal wood hero, multi-lingual actor, road accident, The Villian, teaser launch event, crime

The latest sources from Kannada cinema reveal that Sudeep was injured in a car accident. Sudeep skipped the teaser launch event of The Villain and it indicated that he skipped the event only because of the injuries that he got in the accident.

రోడ్డు ప్రమాదంలో నటుడికి గాయాలు.. అభిమానుల పూజలు..

Posted: 10/03/2018 12:57 PM IST
Kannada hero and multi lingual actor sudeep injured in road accident

బహుభాషా నటుడు, హీరో సుదీప్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కన్నడంలో హీరోగా రాణిస్తూనే.. దక్షిణాది చిత్రాల్లో తన నటనను రుజువు చేసుకునేందుకు విభిన్న పాత్రలను పోషించే ఈ నటుడు ప్రస్తుతం తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్ర వర్గాల ఆయన పాత్రను విడుదల చేశాయి.

కాగా, ఇదే సమయంలో సుదీప్ ప్రస్తుతం కన్నడలో తెరకెక్కుతున్న ది విలన్ చిత్రంలో సుదీప్ నటించాడు. కాగా, ఈ సినిమా టీజర్ లాంచ్ కు హాజరు కావాల్సిన సుదీప్ హాజరుకాలేదు. దీంతో చిత్రవర్గాలు ఎందుకు ఆయన హాజరు కాలేదని ఆరా తీయగా, ఆయన రోడ్డ ప్రమాదంలో గాయాలపాలయ్యాడని తెలుసుకున్నారు. దీంతోనే ఆయన చిత్ర టీజర్ లాంచ్ కు హాజరుకాలేదని కూడా తెలుసుకున్న చిత్రవర్గాలు..ప్రస్తుతం  ఆయన చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది.

కాగా, ‘పైల్వాన్’ అనే మరో చిత్రంలోనూ నటిస్తున్న సుదీప్ షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఆ తరువాత సుదీప్ తాను స్వయంగా తనకైన గాయంపై ట్వీట్ చేశాడు. దీంతో విషయం కాస్తా ఒక్కసారిగా తెలుసుకున్న ఆయన అభిమానులు.. తమ హీరో, నటుడు, సుదీప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. కొందరు అభిమానులు రక్తదానాలు కూడా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles