cops suspended for hitting medical student మెడికల్ విద్యార్థినిపై చేయిచేసుకున్న పోలీసుల సస్పెన్షన్..

Three cops suspended after they hit medical student in meerut

meerut, medical student, muslim boy, hindu young girl, uttar pradesh police, love jihad, police suspended, uttar pradesh, viral video

Three police personnel including a woman constable in Uttar Pradesh’s Meerut were suspended after a video of them allegedly using foul language against a female medical student and her classmate and roughing her up went viral.

మెడికల్ విద్యార్థినిపై చేయిచేసుకున్న పోలీసుల సస్పెన్షన్..

Posted: 09/26/2018 12:47 PM IST
Three cops suspended after they hit medical student in meerut

ఉత్తర్ ప్రదేశ్ లోని పోలీసులు రాజు ఎవరైతే వారి మాటే శాసనం అన్న పంథాలో వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో తాము కేవలం రాజ్యంగాబద్దంగా ప్రజలకు భద్రత కల్పించాల్సిన అవసరముందని గుర్తెరుగని పోలీసులు.. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపి నేతృత్వంలోని యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం వుండటంతో.. ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తోందన్న కారణంగా ఓ యువతిపై దాడి చేసి తమ స్వామిభక్తిని చాటుకున్నారు.

ఆ యువతిని వ్యానులో ఎక్కించుకుని శూలాల్లాంటి మాటలతో మనోవేదనకు గురిచేశారు. అంతటితో అగని పోలీసులు.. యువతిపై అదే వ్యానులో తరలిస్తున్న క్రమంలోనే దాడిచేశారు. అంతేకాదు తాము చేసిన ఘనకార్యాన్ని మోబైల్ లో కూడా రికార్డు చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిందీ ఘటన. పోలీసుల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.  

వీడియోలో ఉన్నదాని ప్రకారం.. పోలీసు వ్యానులో యువతితోపాటు నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. యువతి పక్కన కూర్చున్న మహిళా కానిస్టేబుల్ ఆమెను కొడుతుండగా, డ్రైవర్ వీడియో తీశాడు. ఎంతోమంది హిందూ యువకులు ఉండగా ముస్లిం అబ్బాయిని ఎందుకు ప్రేమించావంటూ డ్రైవర్ ప్రశ్నించడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.  

ఈ ఘటనకు ముందు వైద్య విద్యార్థిని అయిన ఆమె తన  సహచరుడు అయిన ముస్లిం యువకుడి ఇంటికి వెళ్లింది. అక్కడ వారిద్దరు ఉండగా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వారిపై దాడిచేసి పోలీసులకు అప్పగించారు. యువతిని, యువకుడిని వేర్వేరు వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. యువతిని తీసుకెళ్తున్న పోలీసులు ఆమెను దూషిస్తూ దాడి చేశారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, నివేదిక ఆధారంగా పోలీసులపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, యువతీయువకులపై దాడి చేసిన వీహెచ్‌పీ కార్యకర్తల్లో ఒక్కరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles