New shopping mall closed by police చీరల కోసం ఎగబడ్డ మహిళలు.. దుకాణం బంద్

Saree for rs 3 publicity intensifies mall management

Saree for Rs 3, Rs 3 saree publicity, huge crowd, sri vyshnavi shoping mall, warangal police, mall managment

Saree for Rs 3 publicity intensifies mall management as huge crowd throng the mall, police enters into the scene, closes shop and warns managment

చీరల కోసం ఎగబడ్డ మహిళలు.. దుకాణం బంద్

Posted: 09/25/2018 05:46 PM IST
Saree for rs 3 publicity intensifies mall management

ఆడవాళ్లుకు చీరలకు, బంగారు అభరణాలకు ఎంత చక్కటి బంధం వుందో చెప్పకనే చెప్పే ఎన్నో ఉదాహరణలు మనకు తెలిసినవే. ఇక మరో వైపు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు కూడా ఉచితంగా మహిళలకు చీరలను పంఫిణీ చేస్తుంది. అయినా.. అది ప్రభుత్వ కానుక. ఇది మేం కొనుక్కుంటున్నామంటూ మహిళలు చీరలను కొనుగోలు చేస్తుంటారు.

ఈ క్రమంలో మహిళలకు చీరలకు వున్న బంధాన్ని అసరగా చేసుకుని కర్ణాటకలో ఓ వ్యాపారవేత్త.. కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో చీరలను రూపాయికే అందించిన విషయం తెలిసిందే. ఈ ప్రచారం ఎంతో బాగుందని భావించారో ఏమో తెలియదు కానీ కేవలం రూ.3కే చీరలను అందిస్తామని ఓ వస్త్ర షాపింగ్ మాల్ ప్రకటించిన క్రమంలో ఇక మహిళల రెస్పాన్స్ ఎలా ఉంటుందని బావిస్తున్నారు.

వరంగల్‌ నగరంలో కొత్తగా ప్రారంభిస్తున్న షాపింగ్ మాల్ ఈ తరహా ప్రచారాన్ని చేసింది. అయితే మహిళలకు చీరలకు ఉన్న బంధాన్ని అదీ.. రూ.3కు చేతి రుమాలు కూడా రాని రోజుల్లో ఏకంగా చీరను ఇస్తున్నారంటే.. ఇక మహిళాలోకం ఊరుకుంటుంది. వారి ప్రభంజనానం ముందు యాజమాన్యం కూడా ఊహించని రీతిలో చీరల కోసం మహిళలు పోటెత్తారు. వారిని నిలువరించలేకపోయిన యాజమాన్యం చివరికి దుకాణాన్ని మూసివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. దుకాణంలో కిక్కిరిసిన మహిళలను బయటకు పంపించారు. ఇలాంటి ఆఫర్లు ప్రకటించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని దుకాణం యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles