ఎందుకో ఏమో తెలియదు కానీ భారతీయులంటే మాత్రం పరదేశీయులకు మరీ ముఖ్యంగా తెల్లవర్ణం వారికి చులకన భావం ఎక్కువ. అందులోనూ మనాళ్లు ఎందరో ఇలాంటి అవమానాలకు ఎదురువుతుంటారు. మాజీ దేశాధ్యక్షుడు అబ్దుల్ కలాం కూడా పరదేశీ విమానాశ్రయాల్లో ప్రిక్సింగ్ కు గురయ్యారు. అయితే అందరూ వీరు మారరు అని సరిపెట్టుకుంటుంటే కొందరు మాత్రమే దానిని తప్పు అని ధైర్యంగా చెబుతుంటారు. ఆ బాబితాలో ప్రముఖ సినీనటి శిల్సాశెట్టి వున్న విషయం తెలిసిందే.
ప్రముఖ బిగ్ బ్రదర్ షోలో కూడా ఇలాంటి పరాభావానికి గురైన అమె దానిని కూడా ధైర్యంగా ఎదుర్కొంది. అంతేకాదు దానిపై అమె స్పందించిన తీరు.. భారత్ నుంచి వ్యక్తమైన నిరసన నేపథ్యంలో అప్పటి వరకు భారతీయులకు పెద్దగా పరిచయం లేని బిగ్ బ్రదర్ షోకు భారతీయులు పెద్ద సంఖ్యలో వీక్షించడం.. శిల్పా గెలవాలన్న తపనతో ఓటింగ్ చేయడం అన్ని చకచకా జరిగిపోయి. ఆ ఎఫిసోడ్ విజేతగా కూడా ఈ బాలీవుడ్ నటి నిలిచేలా చేసింది. అందులో కో కంటెస్టెంట్ జాత్యాహంకర వ్యాఖ్యలు చేశారు. దీంతో భారతీయుల రియాక్షన్ తో శిల్పా టైటిల్ కోట్టారు.
ఇది అయిపోయిన కథ కదా.. ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నారు.? అంటే.. శిల్పా శెట్టి తాజాగా కూడా ఆ అవమానాన్ని ఎదుర్కోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి, సిడ్నీ నుంచి మెల్ బోర్న్ కు ప్రయాణిస్తున్న వేళ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. తనకు ఎదురైన అవమానాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్న శిల్పా శెట్టి, ఎదుటివారి చర్మం రంగును చూసి ప్రవర్తించే తీరు మారుతుందా? అని ప్రశ్నించింది. తాను జాతి వివక్షను ఎదుర్కొన్నానని చెప్పింది. చెకిన్ కౌంటర్ వద్ద ఉన్న ఓ మహిళా ఉద్యోగి తీరును విమర్శించింది.
తన వద్ద రెండు బ్యాగులున్నాయని, వాటిల్లో ఒకటి అతిపెద్దదిగా ఉందంటూ అభ్యంతర పెట్టిన ఉద్యోగిని ప్రవర్తన తన మనసుకు కష్టాన్ని కలిగించిందని చెప్పారు. తాను పదేపదే బ్యాగును పరిశీలించాలని చెప్పినా, ఆమె వినలేదని, దగ్గరకెళ్లి అభ్యర్థించినా పట్టించుకోలేదని ఆరోపించారు. సమయం మించి పోతుండటంతో ఎక్కువ పరిమాణంలో ఉన్న లగేజీని పరిశీలించే సిబ్బంది వద్దకు తానే వెళ్లానని, వారు చూసి, తన బ్యాగ్ నిర్దేశిత పరిమితికి మించిన బ్యాగు కాదని చెప్పారని అన్నారు. ప్రయాణికుల పట్ల మర్యాద పూర్వకంగా ఉండేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. సిడ్నీ విమానాశ్రయంలో తాను కూర్చుని ఉన్న ఓ చిత్రాన్ని శిల్పాశెట్టి పంచుకున్నారు.
If you enjoyed this Post, Sign up for Newsletter
(And get your daily news straight to your inbox)
Other Articles
![]()
అత్తెసరు చదువులు.. అమెరికా మోజులు.. ప్రాక్సీలతో డాబులు.. జేబులకు చిల్లులు..
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
![]()
ITEMVIDEOS: నవరాత్రి ఉత్సవాల్లో పవర్ కట్.. గ్రామస్థుల ఉపాయం అదుర్స్.!
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
![]()
తిరుమలలో భక్తజన సందోహం.. ఆరు కిలోమీటర్ల మేర క్యూ... ప్రవేశం నిలిపివేత
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
![]()
బీహెచ్ సిరీస్ కావాలా.? మీ వాహనానికి తీసుకోవచ్చు ఇలా.!
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
![]()
'మాకు ఆ ఉద్దేశం లేదు..’ గరికపాటిని ఎవరూ తప్పుగా మాట్లాడొద్దు: నాగబాబు
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more