Maoist attack: Dumbriguda SI suspended డుంబ్రిగూడ ఎసై అమ్మనరావుపై సస్పెన్షన్ వేటు..

Maoist attack dumbriguda si suspended over mla and ex mla murder case

MLA Kidari murder, MLA KSarveswara Rao, Ex MLA saveri Soma, Visakhapatnam, Araku Valley, Vizag city, Maoist sympathisers, Special Operation Team, Dumbriguda S.I, suspension, DGP Tagore

After the attack by Maoists on Araku MLA Kidari Sarveshwar rao and ex mla Soma, DGP Tagore sacked Dumbriguda S.I on the grounds of negligence despite the MLA informing him to give security.

డుంబ్రిగూడ ఎసై అమ్మనరావుపై సస్పెన్షన్ వేటు..

Posted: 09/24/2018 11:26 AM IST
Maoist attack dumbriguda si suspended over mla and ex mla murder case

విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు అత్యంత కిరాతకంగా హత్యచేయడానికి కారణం పోలీసుల నిర్లక్ష్యమేనని ఉన్నతాధికారులు విచారణలో వెల్లడైంది. ప్రాథమిక విచారణలో పోలీసులు ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ గా వచ్చి వుంటే ఇంత దారుణం జరిగివుండేది కాదన్న విషయాన్ని స్థానికులు అరోపించడంతో ఈ దిశగా విచారణ జరిపిన ఉన్నతాధికారులు డుంబ్రిగూడ ఎస్ఐపై వేటు వేశారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తన పర్యటనపై ముందస్తు సమాచారం ఇచ్చినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎమ్మెల్యే అనుచరులు చెప్పడంపై ప్రభుత్వం స్పందించింది. డుంబ్రిగూడ ఎస్సై అమ్మన రావును సస్పెండ్ చేసింది. కిడారి, సోమల హత్యల తర్వాత చెలరేగిన అల్లర్లను అదుపు చేయడంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విఫలమయ్యాయని ప్రాథమిక విచారణలో తేలడంతో వీరిపై వేటువేసినట్లు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని చెప్పారు.

పోలీస్ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ నాయకులు చనిపోయారన్న ఆగ్రహంతో అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై వారి అనుచరులు దాడి చేశారు. డుంబ్రిగూడ ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని వారు ఆరోపించారు. ఈ క్రమంలో డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఔట్ పోస్ట్ ను తగలబెట్టారు. ఫర్నీచర్, ఫైళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. దొరికిన పోలీసులను దొరికినట్లు కొట్టారు. ఈ క్రమంలో రేగిన ఉద్రిక్తత రాత్రికి కానీ చల్లబడలేదు. కాగా ఇవాళ కిడారి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించనున్నట్లు కూడా ప్రభుత్వం పేర్కోంది.

తమ నాయకులను మావోయిస్టులు అక్రమంగా పొట్టన పెట్టుకున్నారని అక్రోశంతో పోలీసులపై దాడులు చేసిన స్థానికులు.. వారి హత్యలకు నిరసనగా రెండు రోజుల పాటు మన్యంలో బంద్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో నేడు, రేపు.. రెండ్రోజుల పాటు బంద్ కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. కిడారి, సోమల హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, మావోయిస్టులను ఏరివేసేందుకు విశాఖ మన్యంలో 12 స్పెషల్ పార్టీ పోలీసుల బృందాలు, 8 గ్రేహౌండ్స్ పార్టీలు కూంబింగ్ ప్రారంభించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mla kidari sarveswara Rao  Ex MLA saveri Soma  dumbriguda SI  DGP Tagore  Andhra Pradesh  

Other Articles