PM Modi announces his assets బంగారు కోటు విలువ లెక్కల్లో వుందా ప్రధానిగారూ.?

India s crorepati pm narendra modi keeps his crores

narendra modi assets, narendra modi wealth, narendra modi bank accounts, narendra modi fd, narendra modi moveable property, narendra modi immovable property, narendra modi total assets, narendra modi total property, assets, crores, cash in hand, movable assets, golden coat, Politics

PM Modi possesses assets worth over Rs 2 crore. As on March 31 this year, PM Modi’s movable assets stood at Rs 1,28,50,498. Among his movable assets, the PM had Rs 48, 944 cash in hand.

బంగారు కోటు విలువ లెక్కల్లో వుందా ప్రధానిగారూ.?

Posted: 09/19/2018 12:57 PM IST
India s crorepati pm narendra modi keeps his crores

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మిత్రులైన పలువురు బడా వ్యాపారవేత్తలకు మాత్రమే లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తూ.. దేశ ప్రజల జేబుల్లోని సొమ్మునంతా తీసుకెళ్లి వారి జేబుల్లో పెడుతున్నారని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు చేస్తున్న క్రమంలో కోట్ల మంది భారతీయులు నివ్వెరపోయేలా.. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ ఆస్తుల వివరాలను ప్రకటించారు. తన మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ.2.28కోట్లు మాత్రమే అని చెప్పారు.

అంతేకాదు ప్రస్తుతం తన చేతిలో వున్న నగదు రూ.50 వేల కంటే తక్కువననని చెప్పారు. ప్రధాని ఈ సంవత్సరం మార్చి 31 నాటికి తన ఆస్తుల లెక్కలు ఇవేనని ఆయన స్వచ్ఛందంగా అస్తుల వివరాలను వెల్లడించారు. అందులోని వివరాల ప్రకారం.. బ్యాంకుల్లో ప్రధాని మోడీ పేరిట కోటి రూపాయల వరకు ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయి. అలాగే మోదీ వద్ద ఉన్న మొత్తం బంగారు అభరణాల విలువ లక్ష రూపాయలు. తన వద్దనున్న ఉంగరాలు, తదితర బండారు అభరణాల విలువల మొత్తం విలువ ఈ మేర వుంటుదని వెల్లడించారు.

వీటితో పాటు గాంధీనగర్‌లో ఓ చిన్న స్థలం, వారసత్వంగా వచ్చిన ఓ నివాస గృహం ఆయన పేరునే వుందని, వాటి విలువ కోటి రూపాయాల వరకు ఉంటుందని చెప్పారు. ఇక తన పేరిట రూ.1.59లక్షల విలువైన ఎల్‌ఐసీ డిపాజిట్లు తెలిపారు. ఇక తన వద్ద కార్లు గానీ, బైకులు గానీ లేవని ప్రకటించిన ప్రధాని.. తన పేరిట ఎటువంటి బ్యాంకు రుణమూ కూడా లేదని తెలిపారు. అయితే ప్రధాని బాధ్యతలను చేపట్టిన తొలినాళ్లలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దేశానికి వచ్చిన తరుణంలో తన మిత్రుడు ఆయనకు బహుకరించిన నమో కోటు.. దాని విలువను మాత్రం తన ఆస్తుల జాబితాలో పేర్కోనడం మర్చిపోయారా.? లేక అవి ప్రధాని పీఠానికి ఇచ్చిన బహుమతా.? అన్న విషయంపై ఇంకా ఎలాంటి క్లారీటీ లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prime minister  Narendra Modi  assets  crores  cash in hand  movable assets  golden coat  Politics  

Other Articles